రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ


Sat,October 12, 2019 01:32 AM

వేములవాడ కల్చరల్: వేములవాడ శ్రీ పా ర్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం వేకువజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పవిత్ర ధర్మగుండంలో స్నా నాలు ఆచరించి, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించికుని ప్రత్యేక పూజలు చేశా రు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వరుసగా దసరా సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ అధికారులు గర్భగుడిలో నిర్వహించుకు పలు ఆర్జిత సేవలైన అభిషేకపూజలు, అన్నపూజలు, ఆకులపూజలను రద్దు చేశారు. దీంతో ఆల య వెనకభాగంలోని బాలాత్రిపురసుందరి అమ్మవారి వద్ద భక్తులు కుంకుమపూజలను నిర్వహించుకున్నారు. రాజన్నను దాదాపు గా 8 వేల మంది భక్తులకు పైగా దర్శించుకున్నారని, వివిధ ఆర్జితసేవల ఆలయానికి సుమారు రూ.6 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. నేడు రెండవ శనివారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అయినప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గర్భగుడి దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...