సీఎం కృషితోనే చెరువులకు జలకళ


Fri,October 11, 2019 04:22 AM

రామడుగు: సీఎం కేసీఆర్ కృషితోనే నేడు చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని దేశరాజ్‌పల్లి ఊర చెరువు పూర్తిస్థాయిలో నీటితో నిండి మత్తడి దూకుతుండడంతో గురువారం ఎంపీపీ కలిగేటి కవితతో కలిసి, ఎమ్మెల్యే దేశరాజ్‌పల్లిని సందర్శించారు. దీనిలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, మత్స్య కార్మికులతో కలిసి చెరువులో గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతోపాటు పూలను సమర్పించారు. పూజారుల మంత్రోత్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. మత్స్య కార్మికులతో కలిసి తోపెలతో చేపల శికారి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాతూ, తాగు, సాగునీరు లేక చెరువులు, కుంటలు ఎండిపోయి బీడు బారిన ఎడారిలాంటి నియోజకవర్గం నేడు కాళేశ్వరం, ఎల్లంపల్లి నీటితో పచ్చని మాగాణిగా మారిందన్నారు. గతంలో రైతుల బాధలను పట్టించుకున్న నాయకుడే లేడన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎండిన పొలాలు, నెర్రెలు బారిన చెరువులే కనిపించేవని పేర్కొన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ముందు వ్వయసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టారన్నారు. అతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తై గోదావరి జలాలు మిడ్ మానేరుకు చేరుకున్నాయనీ, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో చొప్పదండి నియోజకవర్గం మరో కోనసీమగా మారనుందని తెలిపారు. ముఖ్యంగా రామడుగు మండలం కరీంనగర్ జిల్లాకే పచ్చలహారంగా రూపు దిద్దుకోనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రామడుగు మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలు నీటితో నిండి రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నాయన్నారు. తమ ఊరి చెరువును నింపడంపై హర్షం వ్యక్తంచేస్తూ దేశరాజ్‌పల్లి రైతులు, ముదిరాజ్‌లు ఎమ్మెల్యేకు శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోల రమేశ్, ఎంపీటీసీలు వంచ మహేందర్‌రెడ్డి, మడ్డి శ్యాంసుందర్‌గౌడ్, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ జూపాక కరుణాకర్, ఉప సర్పంచ్ మాడుగుల రత్నాకర్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు గంట్ల వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు కత్తెరపాక కనుకయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎల్కపల్లి లచ్చయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కటుకం రవీందర్, నాయకులు దొబ్బల మధు, మ్యాన మురళీధర్, నాగుల రాజశేఖర్‌గౌడ్, రాకేశ్, ఎల్కపల్లి కొమురయ్య, పెగుడ శ్రీనివాస్, రవీందర్, ప్రభాకర్, హన్మండ్లు, గజ్జెల ఆనందరావు, లక్ష్మణ్, రమణ, లచ్చయ్య, శంకరయ్య, ఎల్లేశ్‌కుమార్, చంద్రయ్య, నర్సయ్య, రైతులు, మత్స్యకార్మికులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...