అదే జోరు..అదే ఉత్సాహం..


Fri,October 11, 2019 04:21 AM

కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్‌లో ఈ నెల 7న ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో 10 రోజుల పాటు జరుగనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో నాలుగో రోజైన గురువారం సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో ఎంపికల కోసం యువకులకు అర్హత పరీక్షలు నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలకు చెందిన సుమారు 4,620 మంది యువకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. తెల్లవారుజామున ప్రారంభించిన ర్యాలీకి సుమారు 3,900 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. యువకులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరిశీలించిన అనంతరం స్టేడియంలోకి అనుమతించిన ఆర్మీ అధికారులు.. ముందుగా 1.6 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి ఇతర శారీరకసామర్థ్య పరీక్షలైన లాంగ్‌జంప్, పులప్స్, జిగ్‌జాగ్ వాక్ నిర్వహించి, ఎత్తు, బరువు, చాతి కొలతలు తీసుకున్నారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, వైద్య పరీక్షలకు ఎంపిక చేశారు. ఈ ర్యాలీ 17 వరకు కొనసాగనుండగా వీటిలో టెక్నికల్ గ్రేడ్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సిఫాయి ఫార్మా, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, ట్రేడ్‌మెన్ విభాగంలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నియామక ర్యాలీకి జిల్లా జేసీ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే యువకులు కరీంనగర్‌కు వస్తుండడంతో స్టేడియం సమీప ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...