కలెక్టర్‌కు వినతి


Fri,October 11, 2019 04:20 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: నగరపాలక, మున్సిపాలిటీల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న డెబ్రిస్‌తో డంపింగ్ యార్డులో స్థలం లేక ఇబ్బందులు వస్తున్నాయనీ, కొత్త స్థలాల ఇబ్బందులు కూడా ఉన్నాయనీ, వీటిని దృష్టిలో పెట్టుకొని గ్రానైట్ గుంతల్లో ఈ డెబ్రిస్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు వినతిపత్రం అందించినట్లు నగర మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. భూగర్భం నుంచి గ్రానైట్ రాళ్లను తొలగించిన ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. మున్సిపాలిటీల్లో ఉన్న గ్రానైట్ గనుల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాల్సి అవసరముందన్నారు. భూగర్భం నుంచి తొలగించిన గ్రానైట్ రాళ్ల గుంతలను మైన్స్, మినరల్స్ చట్టం ప్రకారం కూడా పూడ్చాల్సి ఉందని పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ చెత్తను వేసేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నదనీ, గ్రానైట్ రాళ్లను తొలగించిన గుంతల్లో అడుగు భాగంలో దీన్ని నింపి పైన సారవంతమైన మట్టిని పోస్తే హరితహరం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు వీలుంటుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల ఇబ్బందులు కూడా తొలగుతాయనీ, హరితహారం కార్యక్రమానికి స్థలం లభ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ విషయంపై దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...