ప్రణాళికతో అభివృద్ధి


Thu,October 10, 2019 02:59 AM

-30రోజుల కార్యాచరణతో పల్లెల్లో ఎంతో మార్పు
-నాటిన మొక్కలను వందశాతం సంరంక్షించాలి
-పాఠశాలలను రక్షించుకోవాలి
-ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెల ప్రగతికి పాటుపడాలి
-లేకుంటే కఠిన చర్యలు తప్పవు
-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్
-కోరెం, వెంకట్రావుపల్లిలో పర్యటన
బోయినపల్లి: 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుతో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని, పల్లెల్లో ఎంతో మార్పు కనబడుతున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాల్లో నాటిన మొక్కలను ప్రజాప్రతినిధులు తప్పకుండా సంరక్షించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని, గ్రామ పంచాయతీలను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభు త్వం ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. విజయదశమిని పురస్కరించుకొని బోయినపల్లి మండలం కోరెం గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. తొలుత వెంకట్రావ్‌పల్లిలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్‌ఎస్ మండల నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో కోరెం చేరుకోగా, గ్రామస్తులు, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు డప్పుల చప్పుళ్లతో, మంగళహారతి పట్టి స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా ఎనలేని కృషి చేస్తున్నదని కొనియాడారు. గత సరంచ్‌లు గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణపై వివిధ కారణాలతో దృష్టి సారించలేక పోయారని, ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కలెక్టర్, ఎంపీడీవో, తాసిల్దార్లతో పాటు 5వేల మంది ప్రతినిధులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి 30రోజలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. మనస్సుంటే మార్గముంటుందని, అన్నింటికీ డబ్బులే పని చేయవని ఆయన నిరూపించారని కొనియాడారు.

గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నదని, గ్రామాలు స్వతంత్రంగా బతికితేనే దేశం గౌరవంగా ఉంటుందని తెలిపారు. ప్రణాళిక ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు సుందరంగా ముస్తాబయ్యాయని, పారిశుధ్యం, హరితహారం, విద్యుత్ తదితర రంగాల్లో గతంలో కంటే ఎన్నో మార్పులు కనబడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఆ స్ఫూర్తితోనే 30 రోజుల ప్రణాళికను నిత్యం అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మొదటి విడతగా గ్రామాలభివృద్ధి కోసం సగటున ఒక వ్యక్తికి రూ.1600 వంద ల చొప్పన పంచాయతీలకు నిధులను మంజూరు చేశామని గుర్తుచేశారు. జీపీలే స్వతంత్ర ఆర్థిక వనరులను సమకూర్చుకునేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామని, మొక్కల పెంపకం కోసం ప్రతీ గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశామని, అందరూ మొక్కలు నాటేలా పంచాయతీలకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై రూ.70 వేలను వెచ్చిస్తున్నామని, పాఠశాలలను కాపాడుకునే బాధ్యత గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులపైనే ఉందని సూచించారు.

ప్రభుత్వ వైద్యశాలల్లో మరిన్ని మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఆయన వెంట చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, డీసీఎంస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ జడ్పీటీసీ కత్తెరపాక ఉమ, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సర్పంచ్ చెన్నాడి రాజ్యలక్ష్మి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు చెన్నాడి అమిత్‌కుమార్, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎంపీటీసీలు డబ్బు మమత, ఐరేడ్డి గీత, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు, పార్టీ సీనియర్ నాయకులు కత్తెరపాక కొండయ్య, మండలాధ్యక్షుడు మేడుదుల మల్లేశం, నాయకులు లక్ష్మీరాజం, రమేశ్, అనిల్, సృజన్‌రెడ్డి, ఆనంద్, శంకర్, అంజన్‌రావు, కొట్టెపల్లి సుధాకర్, ఆనందరెడ్డి, కిరణ్, బాలమల్లు, సంజీవ్, సుధాకర్‌రావు, మల్లారెడ్డి, సురేందర్‌రెడ్డి, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వినోద్‌కుమార్ దంపతులకు సన్మానం
అనంతరం కోరెంలో నిర్వహించిన విజయ దశమి వేడుకల్లో వినోద్‌కుమార్ మాధవి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి సారిగా గ్రామానికి విచ్చేసిన వారిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్‌ఎస్ నాయకులు భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం పార్టీ నాయకులకు కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు ఆయన దసరా శుభాకాంక్షలు చెప్పారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...