అమాత్యుడికి ఆత్మీయ స్వాగతం


Thu,October 10, 2019 02:57 AM

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: రెండవ సారి మంత్రిగా బాధ్యతలను చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన కేటీఆర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి చేరుకుని దసరా శుభాకాంక్షలు తెలిపారు. జంబీ (శమీ ఆకులు) ఇ చ్చి ఆలింగనం చేసుకున్నారు. వారిలో జడ్పీ అధ్యక్షురాలు సిరిసిల్ల సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు మిరాల భాస్కర్, గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ విజయ పాల సంఘం అధ్యక్షుడు లక్కిరెడ్డి లింబయ్యగారి శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచి సింగారపు నాగరాజుగౌడ్, యూత్ నాయకులు చిట్టంపల్లి భిక్షపతి , రాజేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గోన్నారు. పట్టణంలోని వేంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు కలిసి మంత్రిని సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

వెరి గుడ్..మధు..!
స్వఛ్భభారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు గుజరాత్‌లో నిర్వహించిన స్వఛ్చాభారత్ దివస్ సభకు వెళ్లొచ్చిన సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు, జిల్లెల్ల సర్పంచ్ మాట్ల మధును మంత్రి కేటీఆర్ అభినందించారు. సిరిసిల్లకు విచ్చేసిన మంత్రిని మధు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధును వెరిగుడ్ అంటూ అభినందించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...