రైతులకు మెరుగైన సేవలందిస్తున్నాం


Thu,October 10, 2019 02:57 AM

బోయినపల్లి: రైతులకు సహకార బ్యాంకుల ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు ఉద్ఘాటించారు. బుధవారం బోయినపల్లిలో సహకార సంఘ బ్యాంకును ప్రారం భించారు. ఈ సందర్భంగా రైతులకు ఖాతా, పాసు పు స్తకాలు అందించారు. అనంతరం నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. మండల ప్రజల రై తుల కోరిక మేరకు మండల కేంద్రంలో 63 వ బ్రాం చ్‌ను ప్రారంభించామనీ, ప్రజలకు ఎలాంటి ఇబ్బం దు లు లేకుండా లావా దేవీలు జరుగుతాయని చెప్పా రు. బ్యాంకులో డిపాజిట్లు చేసుకునేందుకు వీలుగా అన్ని వసతులు సమకూర్చామని, నాలుగు నెలల లోపు సొంత భవనం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైతు రుణాలు, పై చదువుల రుణాలు, వాహన రుణా లు, మహిళా సంఘం సభ్యులు అభివృద్ధి చెందడానికి రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. మా స్వప్నం గ్రామీణ సౌభాగ్యం అనే నినాదంతో పని చేస్తున్నట్లు చెప్పారు. 2006 కంటే ముందు 200 కోట్ల లావా దేవీలతో 70 కోట్ల నికర నష్టంతో ఉన్న కేంద్ర సహకార బ్యాంకు ప్రజల సహకారం సింగిల్ విండో అధ్యక్షులు, సిబ్బంది కృషితో నేను పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత, 2018-19 ఆర్థిక సంవత్సరం 3 వేల కోట్ల లావా దేవీ లు 1500 కోట్ల డిపాజిట్లతో భారతదేశంలో సహ కార రంగంలో అగ్ర గామిగా నిలిపామని తెలిపారు.

ఈ నెల చివరి వరకు మరో 4 బ్రాంచ్‌లను ప్రారంభించి ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు 75 శాఖలను ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో సహకార బ్యాంకుల భా గ స్వామ్యం ఉందన్నారు. అదే విధంగా విదేశాల్లో చ దువుకునేందుకు విద్యార్థులకు రుణాలు ఇచ్చామని చె ప్పారు. కేడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్‌రావు, జోగినపల్లి ప్రేమ్‌సాగర్‌రావు, డీసీఎం ఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, కేంద్ర సహకా ర బ్యాంకు సీఈవో సత్యానారాయణరావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సింగిల్ విండో చైర్మన్లు తీపిరెడ్డి కిషన్‌రెడ్డి, దుర్గారెడ్డి, బోయినపల్లి సర్పంచ్ గుంటి లతశ్రీ, స్తంభంపల్లి ఎంపీటీసీ అక్కెన పల్లి ఉపేందర్, నాయకులు కత్తెరపాక కొండయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మేడుదుల మలేశం, కొట్టెపల్లి సుధాకర్, సంబ లక్ష్మీరాజం, గుంటి శంకర్, ఈడుగు స్వామి, ఎడపల్లి బాబు, భీమనాథుని రమేశ్, ఎమిరెడ్డి సురేంద ర్‌రెడ్డి, నల్లగొండ అనిల్ ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...