మహాలక్ష్మి రూపంలో అమ్మవారు..


Thu,October 10, 2019 02:57 AM

వేములవాడ కల్చరల్: విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం వేములవాడ రాజన్న క్షేత్రంలోని రాజరాజేశ్వరిదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆశ్వీయుజ శుద్ధ దశమి సందర్భంగా అర్చక సుహాసినులు అమ్మవారికి అభ్యంగన స్నానం చేయించా రు. అనంతరం శ్రీ సూక్త, దుర్గాసూక్తం ద్వారా అభిషేకం, చతుష్ఠిపూజ, పారాయణాలు, ధ్వజారోహణం, అపరాజిత పూజలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం అద్దాల మండపంలో అష్టావధాని తిగుళ్లశ్రీహరిశర్మచే దేవి భాగవత పురాణప్రవచనంత, రాత్రి రాజరాజేశ్వరీ దేవి, అమ్మవారికి, శ్రీ లలితా సహస్రనామ సహిత చతుష్షష్ట్యో పచార, కన్యక సువాసినీ, రాత్రి 9 గంటలకు నిశీపూజలు చేశారు. ఏకాంతసేవతో ఉత్సవాలు ముగిశాయి.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...