మూడోరోజూ ఉత్సాహంగా..


Thu,October 10, 2019 02:56 AM

కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మూడోరోజూ ఉత్సాహంగా సాగింది. సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో ఎంపికల కోసం 4,620 మంది యువకులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా, బుధవారం నిర్వహించిన ర్యాలీలో సుమారు 3,500 మంది యువకులు పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ర్యాలీలో ముందుగా యువకులకు 1.6 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. నిర్ణీత గడువులో పూర్తి చేసిన యువకులకు లాంగ్‌జంప్, పులప్స్, జిగ్‌జాగ్ వాక్ నిర్వహించి, ఎత్తు, బరువు, చాతీ కొలతలు తీసుకున్నారు. అనంతరం అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, వైద్య పరీక్షలకు ఎంపిక చేశారు. కరీంనగర్‌లో ఈ నెల 7న ప్రారంభమైన ర్యాలీ 17 వరకు కొనసాగనుండగా వీటిలో టెక్నికల్ గ్రేడ్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సిఫాయి ఫార్మా, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, ట్రేడ్‌మెన్ విభాగంలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నియామక ర్యాలీకి జేసీ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తుండగా, ఆయన ఆదేశాల మేరకు పలు విభాగాల అధికారులు ర్యాలీ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సైతం సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...