హైందవధర్మ ఉన్నతికి విశాఖపీఠం కృషి


Thu,October 10, 2019 02:56 AM

వేములవాడ కల్చరల్: సనాతన హైందవధర్మ ఉన్నతికి విశాఖ పీఠం పాటుపడుతున్నదని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రసరస్వతిస్వామివారు వివరించారు. విజయదశమిని పురస్కరించుకుని వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని మంగళవారం ఆయన సందర్శించారు. స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అద్దాల మండపంలో భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. ఈ సందర్భంగా స్వాత్మానందే్రంద సర్వసతి స్మా మాట్లాడుతూ వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆల యం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత, ఎంతో మహిమాన్వితమైనదని తెలిపారు. జిల్లాలో నాలుగు రోజులపాటు పూర్తిస్థాయిలో పర్యటిస్తామని వెల్లడించారు. గురువారం కొండగట్టు, శుక్రవారం ధర్మపురి, ఆ తర్వాత కాళేశ్వరం ఇలా పలు దేవాలయాలను సందర్శిస్తానని వివరించారు. నిత్యం శారదా చంద్రమౌళీశ్వర అర్చన ముగించుకుని మిగతా సమయాన్ని అంతా హిందూ ధర్మపరిరక్షణ కోసం కృషిచేస్తామని తెలిపారు. అనంతరం ఆలయ ఈవో కృష్ణవేణి స్వామివారికి పాదపూజ చేశారు. రాజన్న తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఆయన వెంట హిందూ ధర్మప్రచార యాత్ర ఆంధ్రా, తెలంగాణ రాష్ర్టాల కన్వీనర్ దరువు ఎండీ సీహెచ్ కరణ్‌రెడ్డి, వేదపండితులు, అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...