విదేశాల్లో బతుకమ్మ వేడుకలు


Tue,October 8, 2019 03:27 AM

వేములవాడ కల్చరల్: బతుకమ్మ వేడుకలను వి దేశాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. గార్డెన్ సిటీ ఆఫ్ ఇంగ్లాండ్‌గా పేరుగాంచిన కెంట్ నగరంలోని తెలుగు కమ్యూనిటీ వారి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, పిల్ల లు ఉత్సాహంగా పాల్గొని దాండియా ఆడారు. కార్యక్రమంలో కెంట్ డాట్‌ఫోర్డ్ మేయర్ రోగర్ పెరిఫిట్, పావని గణేశ్, జ్యోతి, శ్రీనివాస్, యమునాదినేశ్, విజయసతీశ్, మల్లికనాగరాజ్, స్వప్నరమేశ్, కేటీసీ టీం సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్‌లో..
ముస్తాబాద్: తెలంగాణ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సింగపూర్‌లో బతుకమ్మ వేడుక లను ఘనంగా నిర్వహించినట్లు ముస్తాబాద్‌కు చెందిన ప్రవాస భారతీయుడు ఏళ్ల రాంరెడ్డి తెలిపారు. సుమారు 1500 మంది మహిళలు పా ల్గొన్నారని, చైనీస్ వారూ పాల్గొనడం మరో ప్ర త్యే కతని వివరించారు. ఉత్తమ పాటలు, బతుకమ్మలకు బహుమతులు అందించామన్నారు. వేడుకల్లో వీరమల్ల సౌ జన్య, మిరియాల సునీత, మర్రి స్వాతి, శ్రా వ ణిరావు, గాడిపల్లి లక్ష్మి, పేట నీరజ, గోపగోని ప ద్మ, నర్రా నిర్మల, పెది కవిత, నల్ల వసంత, కమిటీ సభ్యులు పెద్ది శేకర్, వీరమల్ల కృష్ణప్రసాద్, రాంరెడ్డి, మర్రి వెంకట్‌రెడ్డి, గొపగోని దామోదర్, గాడిపల్లి చంద్రమౌళి, రావురంజిత్‌కుమార్, రవీందర్‌రావు మచ్చడి, చాట్ల విక్రమ్, చిలుక సురేష్, అల్లోల మురళిరెడ్డి, వేణు, శంకర్, విజయ్, తి రుపతి పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...