ప్రజావాణిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి


Tue,October 8, 2019 03:26 AM

కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సంబంధిత సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు అందిన ఆయా శాఖల అధికారులు వెంటనే స్పం దించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యల ను పరిష్కరించారు? మిగిలినవి ఎందుకు పరిష్కరించలేకపోయారు? అనేదానిపై కూడా స్పష్టమైన వివరణ ఇవ్వాలని, సదరు నివేదికలను తనకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే నూతన కలెక్టరేట్ నిర్మాణం తుది దశకు చేరుకున్నదని, అన్ని ప్రభుత్వశాఖల అధికారులు తమ కార్యాలయానికి కావాల్సిన స్థలం వివరాలను జిల్లా రెవెన్యూ అధికారికి అందజేయాలని తెలిపా రు. అనంతరం అర్జీలను స్వీకరించారు.

ప్రజావాణికి 23 దరఖాస్తులు..
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్ర జావాణికి అతితక్కువ విన్నపాలు వచ్చాయి. మొ త్తం 23 దరఖాస్తులు రాగా, అందులో రెండు ప డక గదుల ఇళ్ల మంజూరుపై 6, పెన్షన్, ఇతరత్రా సమస్యలపై 9, రెవెన్యూ సమస్యలపై8 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీఆర్డీవో రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్‌రెడ్డి, డీపీ వో రవీందర్, చేనేత జౌళీ శాఖ ఏడీ అశోక్‌రావు, ఇంటర్మీడియెట్ అధికారి రాంచంద్రం, డీఎండ బ్ల్యూవో సర్వర్‌పాషా, సీపీవో రాజారాం, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీడబ్ల్యూవో ఎల్లయ్య, డీపీఆర్వో దశరథం, ఏడీ సర్వే ల్యాండ్స్ శ్రీనివాస్, ఎ ల్‌డీఎం రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...