చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం


Mon,October 7, 2019 02:54 AM

-ఫిట్స్‌వ్యాధి చికిత్సకు రూ.1లక్ష ఎల్‌వోసీ మంజూరు
-మంత్రికి రుణపడి ఉంటామంటున్న యశ్వంత్ తల్లిదండ్రులు

గంభీరావుపేట : పుట్టినప్పటి నుంచి తరుచూ ఫిట్స్‌తో బాధపడుతూ అనారోగ్యానికి గురైన చిన్నారి చికిత్సకు మంత్రి కేటీఆర్ సాయం అందించారు. పేద కుటుంబానికి చెందిన యశ్వంత్ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. లక్ష ఎల్‌ఓసీ మంజూరు చేశారు. మండల కేంద్రానికి చెందిన గుడ్ల రవి-మౌనిక దంపతుల కుమారుడు యశ్వంత్ (11 నెలలు) మెరుగైన వైద్యానికి మంత్రి కేటీఆర్ రూ. లక్ష రూపాయల ఎల్‌ఓసీ మంజూరు చేశారు. యశ్వం త్ పుట్టినప్పటి నుంచి తరుచూ ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. 11 నెలలు గడిచినా వ్యాధి నయం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందా రు.

చిన్నారి తండ్రి రవి చిన్న నాటి స్నేహితుడు, ముస్తఫానగర్ టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మారవేని కృష్ణమూర్తి యాదవ్ సదరు విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. వెంటనే స్పందించిన కేటీఆర్ చిన్నారి వైద్య ఖర్చుల అంచనాల ప్రకారం కరీంనగర్‌లోని హాస్పిటల్‌లో చికిత్స కోసం రూ. లక్ష రూ పాయల ఎల్‌ఓసీ మంజూరు చేశారు. దీంతో యశ్వంత్‌కు హాస్పిటల్ వైద్యులు చికిత్స ప్రారంభించారు. తమకు వైద్య ఖర్చుల కోసం ఎల్‌ఓసీ మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణఫడి ఉంటామని చిన్నారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...