సిడ్నీలో బతుకమ్మ సంబురాలు


Mon,October 7, 2019 02:52 AM

ముస్తాబాద్ : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ సంబురాలు ప్రవాస భారతీయుల నిర్వహణతో ఖండాతరాలల్లో తెలంగాణ ఖ్యాతి మరింత పెరిగిందని ఆలిఇండియా వెలమ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రావు, కోశాధికారి తన్నీరు బాపురావు పేర్కొన్నారు. ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా వారు సిడ్నీ నగరంలోని రోసెరి కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా వెలమ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రావు, కోశాధికారి పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, ఈసీ మెంబర్ జగన్మోహన్‌రావు హాజరయ్యారు. మహిళలు బతుకమ్మ ఆటపాటలు, దాండియా, కోలాటం నృత్యాలతో స్టేడియం దద్దరిల్లిందని తెలిపారు. సంబురాల్లో అవని, శిఖ, దిశ, వేదన చేసిన తెలంగాణ యాష, భాష, కట్టు, బొట్టు జానపద పాటల సవ్వడి ఆహూతులను అలరించాయన్నారు. లావణ్య, శ్రీలత, సరిత, దివ్వతో పాటు మరి కొందమంది మహిళలు పేర్చిన బతుకమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయన్నారు. ప్రతిభచూపిన వారికి బహుమతులు అందిచారు. రెండేళ్లుగా బతుకమ్మ సంబురాలు ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్నట్లు వెలమ అ సోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియాల అధ్యక్షుడు జె. న ర్సింగారావు, ప్రధాన కార్యదర్శి రమణరావు, పీఆర్‌వో మాధవరావు పేర్కొన్నట్లు వారు తెలిపా రు. ఈ వేడుకలకు రాష్ట్రం నుంచి తమకు అవకాశం రావడం అదృష్టమన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...