ప్రజల భాగస్వామ్యంతోనేప్రగతి


Fri,September 20, 2019 01:27 AM

- గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
- కలెక్టర్ కృష్ణభాస్కర్
- బోయినపల్లి మండలంలో పర్యటన

బోయినపల్లి: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు ప్ర గతి పథంలో పయనిస్తాయని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నా రు. మండలంలోని బూర్గుపల్లి, కోరెం, స్తంభంపల్లి గ్రా మాల్లో ఆయన గురువారం పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీల్లో స్టాండిగ్ కమిటీ సభ్యులు, గ్రామస్తులతో సమా వేశమై కలెక్టర్ మాట్లాడారు. గ్రామాలు అభివృద్ధియే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం దన,ఇ అన్నివర్గాల ప్రజలు భాగాస్వాములవ్వాలని పి లుపునిచ్చారు. పాత ఇళ్లను కూల్చి వేయాలని, నిరుపయోగమైన బావులను పూడ్చాలని సూచించారు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా సద్వినియోగం చేసుకోవాలని, పల్లెలను ఆద ర్శంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. గ్రామ కమిటీలన్నీ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ఎవరూ తమ ఇంటి పక్కన, సమీప పరిసరాలను అపరిశుభ్రంగా ఉం చుకోవద్దని, ఫలితంగా అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
బూర్గుపల్లిలో పారిశుధ్య పనులను పరిశీలించిన కలెక్ట ర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ఇంటి వద్ద పెంట కుప్ప ఉండగా, ఇంటి యజమానిని పిలిచి గంటలోగా తీ సేయాలని, లేకుంటే కార్యదర్శి రూ.30వేల జరిమానా విధిస్తారని హెచ్చరించారు. అనంతరం సంబంధిత ప్ర త్యేక అధికారి రాజుపై మండిపడ్డారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా 11రోజులుగా నిర్వహించిన పనుల తీరును కలెక్టర్ ప్రశ్నించగా, 100శాతం పూర్తయ్యాయని ప్రత్యేకాధికారి లెక్కలు చూపడంతో కలెక్టర్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా పనులు చేయకపోగా, చేసినట్లు నివేదిక చూపుతూ తమాషా చేస్తున్నావా? ప నులు ఎక్కడ పూర్తయ్యాయి అంటు ప్రశ్నించారు. ఫ్ల యింగ్ స్కాడ్ బృందం సభ్యులు గ్రామం బాగుందని అన్నారని మరోసారి ప్రత్యేకాధికారి సమాధానం చె ప్పబోగా, కలెక్టర్ మరింత కోపోద్రిక్తుడై ఈయనకు వెంటనే మెమో ఇవ్వండి అంటూ డీపీవో రవీందర్‌ను ఆదేశించారు.

అదేవిధంగా స్తంభంపల్లిలో జరిగిన పారిశుధ్య పనులపైనా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పన లు జరిగినట్లు ఎక్కడా కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పెంట, చెత్త కుప్పలు రోడ్డు పక్కనే ఉండ డాన్ని గమనించి కార్యదర్శిపై మండిపడ్డారు. పనులు చేయడం చేతకాకపోతే ఇంటికి వెళ్లి ఇంటి వద్దే ఉండాలని హెచ్చరించారు. కలెక్టర్ డీపీవో రవీందర్, జిల్లా బీసీ మై నార్టీ కార్పొరేషన్ ఈడీ సర్వర్‌మియా, తాసిల్దార్ ప్రసాద్, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, జడ్పీటీసీ ఉమ, ప్రత్యేక అధికారులు శ్రీనివాస్, ఇనాయతుల్లా, సర్పంచ్‌లు చెన్నాడి రాజ్యలక్ష్మి, అతికం లచ్చయ్య, అక్కెనపల్లి జ్యోతి, కోరెం ఎంపీటీసీ డబ్బు మమత, ఉప సర్పంచ్ గాజర్ల రోహిణి, వార్డు సభ్యులు, కార్యదర్శులు, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, నాయకులు రవి, సృజన్‌రెడ్డి, కిరణ్, శ్రీనివాస్ తదితరులున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...