ప్రజల భాగస్వామ్యంతోనేప్రగతి


Fri,September 20, 2019 01:25 AM

బోయినపల్లి: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు ప్ర గతి పథంలో పయనిస్తాయని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నా రు. మండలంలోని బూర్గుపల్లి, కోరెం, స్తంభంపల్లి గ్రా మాల్లో ఆయన గురువారం పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీల్లో స్టాండిగ్ కమిటీ సభ్యులు, గ్రామస్తులతో సమా వేశమై కలెక్టర్ మాట్లాడారు. గ్రామాలు అభివృద్ధియే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం దన,ఇ అన్నివర్గాల ప్రజలు భాగాస్వాములవ్వాలని పి లుపునిచ్చారు. పాత ఇళ్లను కూల్చి వేయాలని, నిరుపయోగమైన బావులను పూడ్చాలని సూచించారు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా సద్వినియోగం చేసుకోవాలని, పల్లెలను ఆద ర్శంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. గ్రామ కమిటీలన్నీ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ఎవరూ తమ ఇంటి పక్కన, సమీప పరిసరాలను అపరిశుభ్రంగా ఉం చుకోవద్దని, ఫలితంగా అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...