సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వైద్యం


Fri,September 20, 2019 01:24 AM

కోనరావుపేట: సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రభుత్వం ఆధునిక వసతుల ను కల్పిస్తున్నదని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ కొనియాడారు. ప్రతి గర్భిణీ సర్కారు దవాఖానలో వైద్యం చేయించుకోవాలని సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో రూ.18లక్షలతో ని ర్మించిన ప్రసూతి భవనాన్ని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో అన్నిరకాల మౌలిక సౌకర్యాలను కల్పిస్తూ, నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తుందని వివరించారు. ముఖ్యంగా గర్భిణుల కోసం నిరంతరం వై ద్యులను అందుబాటులో ఉంచుతూ, వారి ఆరోగ్యానికి భ రోసా ఇస్తున్నదని కొనియాడారు. గతంలో ప్రభుత్వ వై ద్యశాలకు రావాలంటే భయపడిన ప్రజలు, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన చర్యలతో నమ్మకంగా వస్తున్నారని వివరించారు. కేసీఆర్ కిట్టు, అమ్మఒడి తదితర కార్యక్రమా లను ఉదహరించారు. అధునాతన వసతులతో కూడిన స దుపాయాలను చేకూర్చుతూ, దేశంలో ఎక్కడా లేని విధం గా ప్రభుత్వ దవాఖానలను సీఎం తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతీ గ్రామంలో వైద్యాధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తూ మందులను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. బీపీ, కుష్ఠు, క్షయ వ్యాధులను గుర్తించి రో గులకు నెలవారీగా చికిత్సతో పాటు మందులను ప్రభు త్వం సమకూర్చుతున్నదని తెలిపారు. వైద్యులు నిర్లక్ష్యం వహించకుండా ప్రసవాల సంఖ్య మరింత పెరిగేలా కృషి చేయాలని ఉద్ఘాటించారు. సమస్యలుంటే నేరుగా తన దృ ష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...