సమష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి


Fri,September 20, 2019 01:24 AM

ముస్తాబాద్: సమష్టి కృషితోనే గ్రామాల అభి వృద్ధి సాధ్యమని డీఆర్వో ఖీమ్యానాయక్ వివరిం చారు. మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పనులను తా సిల్దార్ యాకన్నతో కలసి ఆయన క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాల పూర్తిలో కలుగుతున్న ఇబ్బందులు, పనుల జా ప్యంపై స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో చర్చించారు. ప్రభుత్వం పేదల కోసం ని ర్మించిన కార్యాక్రమాలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఈ సందర్భంగా కోరా రు. అనంతరం మోహినికుంటలో తుదిదశలో ఉ న్న 60 రెండు పడకల ఇండ్లను స్థానిక సర్పంచ్, కల్వకుంట్ల వనజ, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ గోపాల్‌రావుతో కలసి పరిశీలించారు. ప్రభుత్వం మం జూరు చేసిన ప్రతీ పథకాన్ని గ్రామంలో అర్హులకు అందేలా కృషిచేస్తున్న గోపాల్‌రావు, స్థాని కుల ను డీఆర్వో అభినందించారు.

ఇంకుడు గుంతల నిర్మాణం, ఇంటిపన్ను వసూళ్లు, వీధి దీపాలు, పరిశుభ్రత, హరితహారం, సీసీ కెమెరాల ఏర్పా టు, శ్మశానవాటిక, దోబిగాట్, సీసీ రోడ్లు, జీపీ భవనం, మరుగుదొడ్ల నిర్మాణం, యువతకు స్వ యం ఉపాధి పథకాలపై అవగాహన, మహిళల కు కుట్టు శిక్షణ తదితర కార్యక్రమాలను, గ్రామాభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను గోపాల్‌రావు, సర్పంచ్ వనజ డీఆర్వోకు వివరించగా, అవి ఇత రులకు కూడా స్ఫూర్తినిస్తాయని డీఆర్వో కొని యాడారు. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వా మ్యం, అధికారులతో కలసి చేసిన పనులే త్వరి తగతిన పూర్తవుతాయని తెలిపారు. డీఆర్వో వెంట స్థానిక నాయకులు ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...