పౌష్ఠికాహారంతోనే ఆరోగ్యం


Fri,September 20, 2019 01:24 AM

-పోషణ్ అభియాన్ కార్యక్రమంలో జేసీ యాస్మిన్‌బాషా
సిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రతి ఒక్కరూ పౌష్ఠికా హారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యవంతమైన తెలంగాణ తయారువుతుందని జేసీ యాస్మిన్‌బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో పోషణ్ అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని గురువా రం నిర్వహించగా, ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ మాసాన్ని ప్రభుత్వం పోషణ్ అభియాన్ మాసంగా ప్రకటించిందని గుర్తుచేశారు. ప్రజలందరూ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, రక్తహీనత వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగి ఉండడం, పరిసరాలు పరిశుభ్రతలపై చైతన్యం తీసుకురావడం, పోషణ అలవాట్లను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని వివరించారు. ప్రజలందరూ తమ సంపాదన దాదాపు 70శాతం చదువు, ఆరోగ్యంపైనే ఖర్చు పెడుతున్నారని తెలిపారు. పూర్వికులు సహజంగా పండించిన ఆహారాన్ని తీసుకోవడం వల్లే దృఢంగా ఉండేవారని పేర్కొన్నారు. ఆధునిక పోకడలకు పోయి పౌష్ఠిక విలువలు లోపించిన ఆహారాన్ని తీసుకొని నేటి మానవు డు రోగాల పుట్టలా తయారవుతున్నాడని వివరించారు. విద్యార్థులు చిరుతిళ్లనుతగ్గించి శ్రేష్ఠమైన వంటనూనె, ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం సుమారు 33 మంది విద్యార్థులకు రక్తపరీక్షలను నిర్వహించగా, అందులో ఎక్కవ మంది రక్తహీనతతో బాధపడుతున్న గుర్తించారు. విద్యార్థులు పోషణ్ అభియాన్‌పై సంపూర్ణమైన అవగాహన ఉండా లని, ఇతరులను చైతన్యవంతులను చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, వేములవాడ సీడీపీవో ఎల్లయ్య, డీఐఈవో రాంచందర్, సుమన్, జిల్లా కో ఆర్డినేటర్ సురేష్, వైద్యబృందం, అధ్యాపకులు తదితరలు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...