మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం


Fri,September 20, 2019 01:22 AM

ఎల్లారెడ్డిపేట: మత్స్యకారుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ కొనియాడారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలకు ప్రభుత్వం సరఫరా చేసిన చేపపిల్లలను గిద్దచెరువు ఆవరణలో ఆయన గురువారం పంపిణీ చేశారు. అనంతరం డీఏవో మాట్లాడుతూ మండలంలోని వెంకటాపూర్ ధర్మారం చెరువు, గొల్లపల్లిలోని సంగం చెరువు, తిమ్మాపూర్‌లోని మైశమ్మ చెరువు, నారాయణపూర్‌లోని టేకులపల్లి చెరువు, బొప్పాపూర్‌లోని జక్కుల చెరువుల్లో వేసేందుకు కట్ల, బంగారతీగ, బొచ్చె జాతికి చెందిన 1.21లక్షల చేపపిల్లలను పంపిణీ చేశామన్నారు. ఇతరవర్గాల వారూ ఈజీఎస్ కింద చేపల పెంపకం చేపట్టవచ్చని, అందుకు ప్రభుత్వప్రోత్సాహం ఉంటుందని సూచించారు. అనంతరం గిద్దెచెరువలో చేపపిల్లలను ఆయన వది లారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ రేణుక, ఎఫ్‌వో కిరణ్‌కుమార్, ఎఫ్‌ఏ సతీశ్, ఎఫ్‌ఎం మంజుల, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ప్యా క్స్ చైర్మ న్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు పందిళ్ల నాగరాణి, ఎన్గందుల అనసూయ, పందిళ్ల పర్శరాములు, నర్సయ్య పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...