కిక్ బాక్సింగ్ సమరం షురూ


Thu,September 19, 2019 02:14 AM

-నాలుగు రోజులపాటు జాతీయస్థాయి పోటీలు
-27 రాష్ర్టాల నుంచి 1500 మంది క్రీడాకారులు రాక
-ప్రారంభించిన ఎంపీ బండి సంజయ్
-కరీంనగర్‌లో స్పోర్ట్స్ సైన్స్‌ల్యాబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ

కరీంనగర్ స్పోర్ట్స్: ఇప్పటికే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు అతిథ్యమిచ్చిన కరీంనగర్ మరోసారి జాతీయ క్రీడలకు వేదికైంది. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కిక్‌బాక్సిం గ్ సమరం మొదలైంది. వాకో ఇండియా కిక్ బా క్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 20 వరకు జాతీయస్థాయి కేడెట్స్, జూనియర్స్ విభాగంలో పోటీలు జరగనుండగా, పాల్గొనేందుకు 27 రాష్ర్టాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు తరలివచ్చారు. మంగళవా రం క్రీడాకారుల వేయింగ్‌ను, బర్త్‌డే సర్టిఫికెట్లను పరిశీలించారు. బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి పో టీలను ప్రారంభించారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో అర్ధరాత్రి వరకు ఈ పోటీలు నిర్వహించారు. క్రీడాకారుల వెంట 500 మంది అఫీషియల్స్, కోచ్‌లు, మేనేజర్లు హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాకో ఇండియా కిక్‌బాక్సిం గ్ నేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కే ఆగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్‌బాలు, స్టేట్ ప్రెసిడెంట్ టీ రామాంజనేయులు కార్యదర్శి మైపాల్, టోర్నమెంట్ చైర్మన్ ఈ శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజర్ ఆర్ ప్రసన్నకృష్ణ, వైస్ చైర్మన్ మాడుగుల ప్రవీణ్ పాల్గొన్నారు.

గర్వకారణం : ఎంపీ సంజయ్
దక్షణ భారతదేశంలో తొలిసారిగా కరీంనగర్‌లో జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించడం గర్వకారణమని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. 8 కోట్ల కేంద్ర నిధులతో అంబేద్కర్ స్టేడియంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయనీ, అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రితో మాట్లాడి కరీంనగర్‌లో స్పోర్ట్స్ సైన్స్‌ల్యాబ్ ఏర్పాటుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. యుద్ధ క్రీడలైన కరాటే, కిక్‌బాక్సింగ్, కుంగ్‌ఫూలను స్వలాభం కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలని క్రీడాకారులకు ఉద్భోదించారు. పురుషులతో సమానంగా మహిళలు, విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...