నేతన్నకు అండగా ప్రభుత్వం


Thu,September 19, 2019 02:12 AM

వేములవాడ, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం నేతన్నకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నదని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. బుధవారం వేములవాడ చేనేత పారిశ్రామిక సహకార సంఘం 71వ వార్షి క, 82వ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత వృత్తిమీదే ఆధారపడి జీవించేవారికి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ, అండగా నిలుస్తున్నదని కొనియాడారు. నేతన్నకు నూలు ద్వారా వచ్చే సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తున్నట్లు తెలిపారు. త్రిప్ట్ పథకం ద్వారా కార్మికుడు ప్రతి వంద రూపాయలకు 8రూపాయల చొప్పు న పొదుపు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 16 రూపాయలను కలిపి నేతన్న ఖాతాలో జమ చేస్తుందని గుర్తు చేశారు. చేస్తున్న వృత్తిలో మరింత నాణ్యతా ప్రమాణాలను పెంపొందించే శిక్షణను అందించడమే కాకుండా పోటీ మార్కెట్‌ను తట్టుకునేవిధంగా ఉత్పత్తులను నేతన్నలతో తయారు చేస్తుందన్నారు. వేములవాడ చేనేత సహకార సంఘం పరిధిలో ఇప్పటికే శిక్షణను అందించడమే కాకుం డా, మార్కెట్‌లో పోటీ ఉన్న లెనిన్ కాటన్ వస్ర్తాలను తయారు చేస్తూ ఆదాయాన్ని పెంపొందించుకోవడం అభినందనీయమని కొనియాడారు.

సహకార బ్యాంకు తరుపున అవసరమైన సా యాన్ని అందిస్తామని హామీఇచ్చారు. సహకార సంఘం అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ, తాము తయారుచేసి టెస్కో సంస్థ కు అందిస్తున్న వస్ర్తాల బిల్లుల చెల్లింపును త్వరితగతిన ఇప్పించాలని కోరారు. 2018-19 సం వత్సరానికి గాను 57.55లక్షల వస్ర్తాలను టెస్కో సంస్థకు విక్రయించామన్నారు. అలాగే 15.15 లక్షల వస్ర్తాలను తాము స్వయంగా దుకాణాల ద్వారా విక్రయించగా, ఏడాదికి 78.22లక్షల వస్ర్తాలను ఉత్పత్తి చేశామని తెలిపారు. సమావేశంలో చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు అశోక్‌రావు, సహాయ అభివృద్ధి అధికారి ఎంఏ రషీద్, కేడీసీసీబీ బ్యాంక్ మేనేజర్ నితిన్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు పారువెళ్ల రాజేశం, తాటికొండ రాజమల్ల య్య, దేవదాస్, రామస్వామి పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...