వేములవాడ వాసికి బెస్ట్ ఎక్స్‌క్లూసివ్ అవార్డు


Thu,September 19, 2019 02:11 AM

వేములవాడ కల్చరల్: వేములవాడ పట్టణానికి చెందిన మామిడిపెల్లి శ్రీకాంత్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో బెస్ట్ ఎక్స్‌క్లూసివ్ అవార్డును దక్కించుకున్నారు. కీర్తిఆర్ట్స్ అకాడమీ రెండో వార్షికోత్సవం సందర్భంగా బుధవారం తెలంగాణలో వివివిధ రంగాల్లో కృషిచేసిన వారికి ఇచ్చే బెస్ట్‌ఎక్స్‌క్లూసివ్ అవార్డును పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం, ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ చేతులమీదుగా శ్రీకాంత్ అవార్డు అందుకున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...