జీపీఎస్‌ను అమర్చుకోవాలి


Thu,September 19, 2019 02:11 AM

కలెక్టరేట్: డబుల్ బెడ్‌రూం ఇళ్ల అవసరాల కోసం జిల్లా రీచ్‌ల నుంచి ముందస్తు అనుమతి తో ఇసుక సరఫరా చేసే లారీలు తప్పనిసరిగా జీపీఎస్ సిస్టం అమర్చుకోవాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన గల జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇసుక కేటాయింపు, సరఫరాలో పారదర్శకత పెంపు, ప్రాజెక్టులకు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక కేటాయింపులపై చర్చించారు. డబుల్ బెడ్ రూం అవసరాల కోసం జిల్లా రీచ్‌ల నుంచి ముందస్తు అనుమతితో ఇసుక సరఫరా చేసే లారీలు తప్పనిసరిగా జీపీఎస్ సిస్టం అమర్చుకోవాలనీ, లేకుంటే ఇసుక కేటాయింపు, సరఫరా అనుమతులు ఇవ్వకూడదని కమిటీ తీర్మానించింది. మానేరు నది నుంచి తంగళ్లపల్లి, సిరిసిల్లల ప్రాంతాల నుంచి ఇసుక తరలింపు వివాదాల పరిష్కారం నిమిత్తం 8మంది ప్రభుత్వ అధికారులతో తనిఖీబృందాన్ని తక్షణమే ఏర్పా టు చేయాలని కమిటీ నిర్ణయించింది. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక పూడిక తీసేందుకు అవకాశం ఉందన్నారు.

ఇదివరకే ఒడ్డుకు పోసిన ఇసుక 11వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందనీ, ఇసుక లభ్యతను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు జరపాలన్నారు. రోజుకు ప్యాకేజీ-9కు 35 లారీలు, ప్యాకేజీ-10, 11, 12కు 20 లారీలు, ప్యాకేజీ -13, 14కు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కాలువలను కలుపుకొని 200లారీలు, 2బీహెచ్‌కేల కోసం 20లారీలు కేటాయింపులు జరపాలని కమిటీ నిర్ణయించింది. 2బీహెచ్‌కే ఇసుక లోడింగ్ పనులను టీఎస్‌ఎండీసీ ఇప్పటికే రైసింగ్ గుత్తేదారు మంజీరా మెగా ప్రాజెక్ట్‌కు అప్పగించగా, దీనికి కమిటీ ఆమోదం తెలిపింది. వేములవాడ స్థానిక అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం వేములవా డ సమీప మూలవాగు రీచ్ నుంచి ఇసుక కేటాయించే అధికారం వేములవాడ అర్బన్ తాసిల్దార్‌కు అప్పగించింది. సమావేశంలో జేసీ యాస్మిన్‌బాషా, డీఆర్వో ఖిమ్యానాయక్, మైనింగ్ ఏడీ సైదులు, ఈఈలు విఘ్నేశ్వర్‌రెడ్డి, కనకరత్నం, టీఎస్‌ఎండీసీ పీవో తారక్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...