మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి


Thu,September 19, 2019 02:11 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదనీ, బ్యాం కు లాభాల్లో వారి పాత్ర కీలకమనీ టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ జగిత్యాల శాఖతో మహిళలకు రుణాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పొన్నాల గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే బ్యాంకులు ముందుకు వచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు రుణాలివ్వా లని పేర్కొన్నారు. సహకార బ్యాంకు గ్రామీణుల ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్నదనీ, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రాష్ట్రంలోనే ముందంజలో ఉండడం అభినందనీయన్నారు. రూ. 200కోట్లు ఉన్న లావాదేవీలు రూ.3వేల కోట్ల కు పెరిగాయని తెలిపారు. బ్యాంకు లాభాల బాటలో నడిచేందుకు చైర్మన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జగిత్యాల జిల్లాలో మహిళలకు రూ.1.50 కోట్ల రుణం అందించారనీ, జిల్లా కేంద్రంలోని మహిళలకు ఎక్కువ రుణం ఇచ్చినా వాయిదాలు తప్పక చెల్లిస్తారనీ, వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా బ్యాంకు వారు రుణం మంజూరు చేయాలని సూచించారు.

జిల్లాలో గోదాములు తక్కువ ఉన్నాయనీ, బ్యాం కు వారు గోదాములకు రుణం ఇస్తామన్నం దున ప్రతి మండలానికీ ఒక గోదాము కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో రూ.19కోట్ల 40 లక్షల వరకు రుణాలు అందించినట్లు పేర్కొన్నారు. రుణం పొంది వాటిని సద్వినియోగం చేసుకునే సం ఘాలకు తప్పక రుణం మంజూరు చేస్తామన్నారు. మహిళల అభ్యున్నతి కోసం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మహిళ లు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమనీ, సహకార కేంద్ర బ్యాంకు అందుకే సహాయ సహకారాలు అందిస్తున్నదని చెప్పా రు. జిల్లాలో ఉత్తేజం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు పాఠశాల ప్రారంభానికి ఉదయం గంట, సా యంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో మెటీరియల్, ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ కోసం విరాళాలు సేకరించుకొని మూడేళ్లుగా ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపామని పేర్కొన్నారు. పేద విద్యార్థులు చదువుతున్న 66పాఠశాలలను దత్తత తీసుకునేలా చూడాలని బ్యాంకు చైర్మన్‌కు సూచించారు. కార్యక్రమం లో డీఆర్డీఏ పీడీ భిక్షపతి, అదనపు పీడీ సతీష్, ఎల్‌డీఎం లక్ష్మీనారాయణ, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...