పరిశుభ్రత పరుగు


Wed,September 18, 2019 02:09 AM

-ఉత్సాహంగా 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక
-స్వచ్ఛందంగా ముందుకొస్తున్న ప్రజానీకం
-ఊరూరా శ్రమదానాలు
-జోరుగా స్వచ్ఛత కార్యక్రమాలు
-శిథిలమైన ఇండ్ల తొలగింపు
-తిమ్మాపూర్‌లో పారపట్టిన కలెక్టర్
-బొమ్మకల్‌లో చెత్త వేయకుండా సీసీ కెమెరాలు
పల్లెల్లో పరిశుభ్రత పరుగులు పెడుతున్నది.. ఏ ఊరు చూసినా పారిశుధ్య పనులు, శ్రమదానాలతో ప్రతి రోజూ సందడిగా కనిపిస్తున్నది.. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికతో అందంగా ముస్తాబవుతున్నది.. 12 రోజులుగా పండుగలా కొనసాగుతున్న ఈ కార్యక్రమంతో గ్రామం రూపురేఖలు మార్చుకుంటున్నది.. మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శ్రమదానాలు చేశారు. తిమ్మాపూర్ మండలంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పార పట్టి చెత్త ఎత్తారు. కరీంనగర్‌రూరల్ మండలం బొమ్మకల్‌లో చెత్తవేసే వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు.
(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ);రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రోజుల పల్లె ప్రణాళికలో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడ చూసినా శ్రమదానం, పారిశుధ్య పనులు జరిగాయి. పలు గ్రామాల్లో శిథిలపైన ఇండ్లను తొలగించారు. పాడు బడిన బావులను పూడ్చివేశారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని వీధుల్లో చెత్త చెదారాన్ని ఎత్తి పోసేందుకు స్థానికులతో కలిసి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జడ్పీ సీఈఓ డీ వెంకటమాధవరావు, డీపీఓ ఎం రఘువరణ్, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, తదితరులు పాల్గొన్నారు. అలాగే మహాత్మనగర్ గ్రామంలో పాఠశాల వద్ద పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్, మహాత్మనగర్‌లో మొక్కలు నాటారు. కరీంనగర్ మండలం బొమ్మకల్‌లో జరిగిన శ్రమదాన కార్యక్రమంలో ఆర్డీఓ ఏ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు. ఇక్కడి బైపాస్ రోడ్డులోని ైఫ్లె ఓవర్ కింద చెత్తా చెదారం తొలగించారు. కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ చెత్త పడేస్తున్నారని తెలుసుకుని వెంటనే సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్డీఓ ఆనంద్‌కుమార్ దుర్షేడు గ్రామంలోని బుడిగ జంగాల కాలనీ, ఎస్సీ కాలనీ, పద్మశాలి వీధుల్లో పర్యటించారు. ఫకీర్‌పేటలో కరీంనగర్ రూరల్ సీఐ తుల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ఎంపీడీఓ పవన్‌కుమార్ పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం నాగులమల్యాలలో చెత్త చెదారాన్ని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి డంపింగ్ యార్డుకు తరలించారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్, ధర్మరాజ్‌పల్లి, చిన్నపాపయ్యపల్లి, జమ్మికుంట మండలం తనుగుల, శంభునిపల్లిలో ఆర్డీఓ చెన్నయ్య పాల్గొని పారిశుధ్యం పనులను పరిశీలించారు. పలు చోట్ల శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...