యూరియాను అధిక ధరకు అమ్మితే చర్యలు


Wed,September 18, 2019 02:07 AM

ఇల్లందకుంట: రైతులకు యూరియాను అధిక ధరకు విక్రయిస్తే డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తానని హుజూరాబాద్ ఏడీఏ ఆదిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఇల్లకుంటలోని పలు ఫెర్టిల్జెర్ షా పుల్లో తనిఖీలు నిర్వహించారు. యూరియా స్టాక్ వివరాలను డీలర్లను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ వానా కా లం సీజన్‌లో డివిజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా సరఫరా చేశామన్నారు. ఇల్లందకుంటకు 19వేలు, జమ్మికుంటకు 19వేలు, సైదాపూర్ 23వేలు, హుజురాబాద్ 18వేల ఎరువుల బస్తాలను రైతులకు విక్రయించినట్లు చెప్పారు. గత ఏప్రిల్ మా సంలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత ఉండకుండా ఎరువుల బస్తాలను మండలాలకు పం పిణీ చేసినట్లు తెలిపారు. 14 వేల, 9వందల యా రియా, 5వేల డీఏపీ, 11వేల కాం ప్లెక్స్ ఎరువులు, 8 వేల పోటాష్ ఎరువులను అందుబాటు లో ఉంచామని పేర్కొన్నారు. వచ్చే వానాకలం సాగు కోసం గ్రామాల్లోని చెరువులు, కుంటలు నీటితో నిండి వున్నాయని, వివిధ పం టల సాగు కోసం గ్రామాల్లోని రైతు సమన్వయ గ్రామ కో-ఆర్డినేటర్లతో పాటు రైతులతో గ్రామ సభలు నిర్వహించి, ఎరువుల కోసం ఈనెల 25 లోపు ప్రణాళికలను సిద్ధ్దం చేస్తామన్నారు. యూరియా కోసం రైతులు ఎలాంటి ఆం దోళన చెందవద్దనీ, అన్ని సోసైటీ, డీసీఎం గొదాంలో స్టాక్ ఉందన్నారు. ఈ సమావేశంలో ఏఈఓలు సంపత్, రాకేష్, మహేందర్ తదితరులు ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...