చెరువులు నింపేందుకు ఎమ్మెల్యే కృషి


Wed,September 18, 2019 02:06 AM

గంగాధర: నియోజకవర్గంలోని ప్రతి చెరువును నింపి, చివరి మడి వరకు సాగు నీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపూర్ రిజర్వాయర్, వరదకాలువ ద్వారా గ్రామాల్లో చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయన్నారు. కొన్ని గ్రామాల్లోని చెరువులకు నీళ్లు రాకపోవడంతో ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించి, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. దీంతో మల్లాపూర్ వద్ద నుంచి వెళ్తున్న డీ4 కెనాల్ నుంచి గోపాల్‌రావుపల్లి, వెంకంపల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల చెరువులు, కుంటలు నింపడానికి వారం క్రితం నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. చెరువుల్లోకి నీళ్లు విడుదల చేశారని తెలుసుకున్న ప్రతిపక్ష నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రైతులు వారి మాటలు నమ్మవద్దనీ, మండలంలోని ప్రతి చెరువును నింపడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి, కోలపురం లక్ష్మణ్, కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, నాయకులు తాళ్ల సురేశ్, ముద్దం నగేశ్, వేముల అంజి, తడిగొప్పుల రమేశ్, ఎగుర్ల మల్లయ్య, దోమకొండ మల్లయ్య, ఆదిమల్లు, ఓదెలు, ఆంజనేయులుగౌడ్, శ్రీనివాస్, తదితరులున్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...