ఇక ఆన్‌లైన్‌లో క్రిమినల్ కేసుల నమోదు


Tue,September 17, 2019 03:06 AM

-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్
- కరీంనగర్‌లో పాల్గొన్న జిల్లా జడ్జి, సీపీ
కరీంనగర్ లీగల్: పోలీసు జుడిషియరీకి సంబంధించి ఆన్‌లైన్‌లో క్రిమినల్ కేసుల వివరాల నమోదు ప్రక్రియను సోమవారం హైకోర్టు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా ఆన్‌లైన్‌లో పోలీస్‌స్టేషన్ల నుంచి కోర్టులతో పాటు సంబంధిత డిపార్టుమెంట్లకు నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ పైలెట్ ప్రాజెక్టును దేశంలోనే తెలంగాణ రాష్ట్రంగా ఎంచుకుని వరంగల్ జిల్లాలో మొదటిసారిగా గతేడాది డిసెంబర్‌లో ప్రవేశపెట్టారు. రెండో పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ఎంచుకోగా చీఫ్ జస్టిస్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించగా, జిల్లా కోర్టులో జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి, ఐసీటీఎస్ మాస్టర్ ట్రైనర్, హుజురాబాద్ జూనియర్ సివిల్ జడ్జి రాధిక, ఇతర న్యాయమూర్తులు, పోలీస్‌శాఖకు సంబంధించి కరీంనగర్ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ వీబీ కమలాసన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ ఉదయం 9.45 గంటలకు ప్రారంభంకాగా ప్రాజెక్టు గురించి సుప్రీం కోర్టు ఈ-కమిటీ మెంబర్ యశ్వంత్ గోస్వామి, నోడల్ ఆఫీసర్, జూనియర్ సివిల్ జడ్జి రాధిక, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్ రవిగుప్తా వివరించారు. అనంతరం సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ప్రారంభానికి కరీంనగర్ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రవేశపెట్టిన రెండో కమిషనరేట్ కరీంనగర్ కావడం సంతోషంగా ఉందన్నారు. క్రిమినల్ కేసుల వివరాలను ఆన్‌లైన్ నమోదులో భాగంగా ఒక కేసుకు సంబంధించి చార్జిషీటు అప్‌లోడ్ చేసినట్లు వివరించారు. రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును తెలంగాణలో ప్రారంభించడం ఆనందంగా ఉందనీ, చీఫ్ జస్టిస్ సహకారంతో త్వరలో అన్ని జిల్లాలలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీని ద్వారా పోలీసులకు ఎంతో ఉపయోగంతో పాటు, విచారణల్లో నాణ్యత ఉంటుందన్నారు. జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును జిల్లాలో ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. చీఫ్‌జస్టిస్, సీపీ కమలాసన్‌రెడ్డి అప్‌లోడ్ చేసిన చార్జిషీటు వివరాలను డౌన్‌లోడ్ చేసి ప్రారంభించారు. చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ జుడిషియరీలో ఐసీజేఎస్‌తో పాటు నేనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ (ఎన్‌ఎస్‌టీఈపీ) ప్రవేశపెట్టడం అభిందనీయమని తెలిపారు. ఈ-కోర్ట్స్ విధానంలో అన్ని అనుబంధ విభాగాలు సమన్వయంతో ముందుకు వెళితే బాధితులకు న్యాయంతో పాటు కేసులు సత్వర పరిష్కారమయ్యే అవకాశాలుంటాయని చెప్పారు. ఎన్‌స్టెప్ ద్వారా సమన్లు, వారంట్ల జారీ అమలు విధానం వరకు ట్రాకింగ్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం మంచి పరిణామమన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...