వైభవంగా విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు


Tue,September 17, 2019 03:02 AM

కరీంనగర్ కల్చరల్ : నగరంలోని కమాన్ చౌరస్తా వద్ద ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహేంద్రస్వామి దేవాలయంలో సోమవారం విశ్వకర్మ భగవానుని బ్రహోత్సవాలు రెండవ రోజు వైభవంగా కొనసాగాయి. ఉదయం 5గంటల నుంచి సుప్రభాత సేవ, వేదపారాయణం, స్థాపిత దేతారాధనలు, పంచబ్రహ్మలు, శ్రీగాయత్రీ విశ్వకర్మ యజ్ఞము, నివేదన, మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి స్థాపిత దేవతారాధనలు నిర్వహించారు. శ్రీగాయత్రి విశ్వకర్మ భగవానుని పల్లకీసేవ- లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మంగళహారతి, తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి మాజీ చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్, మాజీ ధర్మకర్తలు శ్రీరామోజు నాగరాజు, మియాపురం బ్రహ్మచారి, వేములవాడ రవీంద్రాచారి, అనసూరి రమేశ్, ముత్తోజు సూర్యనారాయణ, ఈవో కొస్న కాంతారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, దేవాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.జిల్లా గోల్డ్, సీల్వర్ జువెల్లరీ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రహోత్సవాల్లో భాగంగా నగరంలోని టవర్‌సర్కిల్ వద్ద అన్నదానం చేశారు. జిల్లా గోల్డ్, సీల్వర్ జువెల్లరీ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగల రమేశ్, ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి రమేశ్, దేవిశెట్టి రమేశ్, మాజీ కార్పొరేటర్ రమణ, ధర్మకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...