ఎల్‌ఎండీ@13.591 టీఎంసీలు


Tue,September 17, 2019 03:01 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వస్తున్న నీటితో మండలంలోని ఎల్‌ఎండీలో 13.591 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం రివర్స్ స్లూయిస్ నుంచి విడుదల చేస్తున్న నీరు ఎల్‌ఎండీలోకి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఎల్‌ఎండీలోకి సోమవారం ఉదయం ఇన్‌ఫ్లో రూపంలో 3,805 క్యూసెక్కుల నీరు రాగా, రాత్రి వరకు 3,238 క్యూసెక్కులు వచ్చి చేరాయి. దీంతో ఎల్‌ఎండీలో నీటి మట్టం 13.591 టీసీఎంలకు చేరింది. ఎల్‌ఎండీ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలకుగానూ ప్రస్తుతం సోమవారం రాత్రి వరకు 13.591 టీఎంసీలు (905.90 అడుగులు) నీటిమట్టం ఉండగా, ఇన్‌ఫ్లో రూపంలో 3,238 క్యూసెక్కులు వస్తుండగా, ఔట్‌ఫ్లో రూపంలో 275 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...