మొక్కల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత


Mon,September 16, 2019 02:57 AM

వీర్నపల్లి: మొక్కల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని జడ్పీటీసీ గుగులోతు కళావతి అన్నారు. వన్‌పల్లిలో ఆదివారం హరితహారం నిర్వహించగా, స్థానిక ప్రజాప్రతి నిధులతో కలిసి మొక్కలు నాటా రు. అనంతరం మాట్లాడుతూ, హరితహారం లో ప్రతిఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. మహిళలు పెద్దఎత్తున ఇంటి ఆవరణలో పూలు, పండ్ల మొక్కలు నాటాలని కోరారు. భవిష్యత్‌లో మానవ మనుగడ మొక్కలతోనే సాధ్యమని చెప్పారు. 30రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించి మొక్కలు నాటి పచ్చదనంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు జోగినిపల్లి లత, ఎంపీటీసీ బానోతు పద్మ, ఎస్‌ఐ రాంచంద్రం, ఎంపీడీవో భారతి, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఉప సర్పంచ్ శేఖర్, మండల యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ గుండా మల్లేశం, నాయకులు మల్లేశం, సంతోష్, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, లకా్ష్మరెడ్డి, జక్కుల ప్రవీణ్, అన్నారం అజయ్, రాజశేఖర్, అరవింద్, సీఏలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...