ప్రజా సేవలో నిమగ్నమవుతా


Mon,September 16, 2019 02:56 AM

ఎల్లారెడ్డిపేట: ప్రజలకు సేవచేసేందుకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటానని జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ చాంద్‌పాషా అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలో చాంద్‌పాషాను ఆయన స్నేహితులు (పదో తరగతి) సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనతోపాటు తన స్నేహితుడు సోమారపు శరవింద్‌కు సైతం టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ బాధ్యతలను అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం, పార్టీ నమ్మకా న్ని వమ్ముచేయకుండా పని చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరిని తోటి స్నేహితులు సన్మానించి, మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆడెపు లింగమూర్తి, మ హ్మద్ షాదుల్, బాలకృష్ణ, ఎడ్ల సందీప్, రవి, లద్దునూరి రమణ, రాజు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...