రచయితలుగా ఎదగాలి


Mon,September 16, 2019 02:56 AM

సిరిసిల్ల ఎడ్యుకేషన్: విద్యార్థులు ఉత్తమ రచయతలుగా ఎదగాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని రంగినేని ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల పండుగ కార్యక్రమం ముగింపు సమావే శాన్ని ఆదివారం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. సిరిసిల్ల నుంచి సినారె, పెద్దింటి, నలిమెల, పత్తిపాక మోహన్ లాంటి ఎందరో రచయితలు ఉన్నారని, వారిలా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు ర్యాంకుల దృష్ట్యా చదవకుండా, విలువలతో కూడిన విద్యను చదవాలని సూచించారు. ట్రస్టు నిర్వాహకులు మోహన్‌రావు మాట్లాడుతూ కథలు, కవిత్వాలను రా యాలని అసక్తి ఉన్న విద్యార్థులకు రెండ్రోజులు పాటు శిక్షణ ఇచ్చామని, 300మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారని ఆయన వివరించారు.

అనంతరం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశాంస పత్రాలను అందజేశారు. అంతేకాకుండా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఘనంగా శాలువతో సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమంలో డాక్టర్ పత్తిపాక మోహన్, గరిపెల్లి అశోక్, రంగినేని నవీన్‌కుమార్, ఎలగొండ రవి, వాసరవేణి పర్శరాములు, మద్దికుంట లక్ష్మణ్, పెద్దింటి అశోక్‌కుమార్, జూకంటి జగన్నాథం, జనపాల శంకరయ్య, వెంకట్రావ్, అరవింద్, దేవంద్రచారి, నల్లగొండ సురేశ్, ఆడెపు లక్ష్మణ్, దేవానందం, భాస్కర్, బాల్‌రెడ్డి, నాగేంద్రం, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...