శాస్త్రీయ ఆలోచనలకు కథలు దోహదం


Mon,September 16, 2019 02:56 AM

సిరిసిల్ల రూరల్: పిల్లలు కథలు రాయడం వల్ల సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనలు పెరుగుతాయని, అవి భవిష్యత్‌కు ఎంతో దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఇన్‌చార్జి రాజా అన్నారు. సిరిసిల్ల మండలం రగుడులోని రంగినేని సుజాత మోహనరావు చారిట్రబుల్ ట్రస్టులో పిల్లల కథల సంకలనంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సన్నహాక సమావేశా న్ని ఆదివారం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు సంపతి రమేశ్ అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో రాజా పాల్గొని మాట్లాడారు. కథలతో పిల్లల ఆలోచనశక్తి పెరుగుతుందన్నారు. తొలుత రామరాజు మాట్లాడుతూ 6 నుంచి 10 తరగతి విద్యార్థులందరూ కథలు రా యాలని, ప్రతి కథా మూఢ నమ్మకాలకు తావులేకుండా, కుల, మత రహితంగా ఉండాలని సూచించారు. ఉత్తమ కథలను ఎంపిక చేసి బాలల దినోత్సవం నవంబర్ 14న పుస్తకరూపంలో తీసుకువస్తామన్నారు. సమావేశంలో జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, కరీంనగర్, పెద్దపల్లి బాధ్యులు అరుణ్, శంకర్, జిల్లా బాధ్యులు విష్ణు, మార్వాడి గంగరా జు, శ్రీహరి, సురేశ్, ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...