విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వ కృషి


Mon,September 16, 2019 02:55 AM

సిరిసిల్లటౌన్: స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని, అందులో భాగంగా విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ కొనియాడారు. విశ్వబ్రాహ్మణ సంఘం జిల్ల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. కా ర్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ అధ్యక్షురాలు అరుణ హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాం క్షలు తెలిపి అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రా ష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ సేవలను గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో చేతి వృత్తులకు సీఎం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. ఐక్యతతో ఉంటూ ప్రభు త్వ పథకాలను ఫలాలను పొందాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా విశ్వబ్రాహ్మణ సం ఘం నేతలు అరుణను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో చిన్నోజు రాజా రాం, వేములవాడ ఎఫ్‌ఆఆర్వో వేణుగోపాలచారి, కోనరావుపేట సెస్‌డైరెక్టర్ తిరుపతి, శ్రీరాముల వేణుగోపాలచారి, శంకర్ పాల్గొన్నారు.

సంఘం నూతన కార్యవర్గం..
అధ్యక్షుడిగా విశ్వనాథుల రమేశ్, ప్రధానకార్యదర్శిగా సనుగుల సత్యం, కోశాధికారిగా చిలుముల హన్మయ్యచా రి, ఉపాధ్యక్షులుగా మొగులోజు వెంకటచారి, మేర్గోజు క ల్యాణ్, చేపూరి అజయ్, చందనం సత్యనారాయణ, ముం డ్రాయి రవీందర్, గజ్జెల ఆంజనేయులు, యశోదరాజు, ప్రచార కార్యదర్శిగా బూరుగుపల్లి రాజేందర్, కొత్తపల్లి శ్రీ నివాస్, న్యాలపల్లి అజయ్, యశోద రాంబాబు, తిప్పారపు స్వామి, వేణుగోపాల్, రాజూరి రవీందర్, సలహాదారులుగా తాటికొండ దేవేంద్ర, మాజోజు లక్ష్మీరాజం, కట్ట కృష్ణమూర్తి, శ్రీరాముల శ్రీనివాస్, విశ్వనాథుల మారుతి, ఓరుగంటి తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా కొడుముంజ రాజు, తిప్పవరపు ఓంకార్, దర్శనాల రాములు, మొగిలోజు రాంచంద్రం, వంగల రవీందర్, వలబోజు సదానందం, చేపూరి సత్తయ్య, శ్రీమంతుల దామోదర్, తిప్పవరం ఆనందం, కాగిలంచ రాజేశం, సజ్జనం రాజశేఖర్, ఇల్లెందుల తిరుపతి ప్రమాణ స్వీకారం చేశారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...