స్వచ్ఛ పథం


Sun,September 15, 2019 01:28 AM

-అపరిశుభ్రత.. చెత్తపై పల్లెల్లో యుద్ధం
-క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్‌కు అడుగులు
-రోజంతా వీధుల్లో పారిశుధ్య పనులు
-అధికారులు, ప్రజాప్రతినిధుల కృషితో పరుచుకుంటున్న ప్రగతి దారులు
-వెల్లివిరుస్తున్న చైతన్యం
-ఊరూరా పండుగ వాతావరణం
-చందుర్తి మండలంలో పాల్గొన్న కలెక్టర్ కృష్ణభాస్కర్

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: పల్లెలు స్వచ్ఛ పథం వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నారు. ప్రగతి ప్ర ణాళికలో భాగంగా 9వ రోజైన శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో మహిళలంతా కలిసి పెద్ద ఎత్తున శ్రమదానంలో భాగస్వాములయ్యారు. వీధులను శుభ్రం చేయడంతో పాటు ఇండ్ల ముందు ముగ్గులు వేసి ఆదర్శంగా నిలిచారు. గ్రామాల్లో ఎక్కడా అపరిశుభ్రత కనిపించకుండా పిచ్చిమొక్కలు తొలగించివేసి, చెత్త లేకుండా చేశారు. చందుర్తి మండలం జోగాపూర్, సనుగుల, రామారావుపల్లె, మర్రిగడ్డ గ్రామాల్లో ప్రణాళిక కార్యక్రమాలను కలెక్టర్ కృష్ణభాస్కర్ పరిశీలించారు.

పనులను ప్రత్యేకాధికారులు మండల అధికారులకు రోజువారీగా నివేదించాల ని ఆదేశించారు. గ్రామస్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, మార్పు లేకపోతే విధుల నుంచి తప్పిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. బోయినిపల్లి మండలంలో డీఆర్‌డీఎ రవీందర్, కోనరావుపేట మండలం పల్లిమక్త, గొల్లపల్లి గ్రామాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పర్యటించి, పనులను పరిశీలించారు. ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీ పీ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. వేములవాడ మండ లం రుద్రవరం గ్రామంలో సర్పంచ్ ఊరడి రాంరెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం చేపట్టిన మహిళలను అధికారులు అభినందించారు. అన్ని గ్రామాల్లో ప్రజలంతా కలిసి కట్టుగా గ్రామాలను శుభ్రం చేసుకున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...