గ్రామంలో చెత్త లేకుండా చేయడమేగాక, మొక్కలు పెంచు తున్న రామారావుపల్లె సర్పంచ్, 30 రోజుల ప్రణాళిక కమిటీ సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినంధించారు. గ్రామాన్ని 30 రోజుల ప్రణాళికలో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ రవీందర్, ఎంపీపీ బైరగోని లావణ్య, జడ్పీటీసీ నాగంకుమార్, ఎంపీడీవో రవీందర్, ఈవోపీఆర్డీ శైలజ, ప్రత్యేక అధికారులతో పాటు అన్నిగ్రామాల స ర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు తదితరులున్నారు.