గ్రామస్తులంతా పనిచేస్తేనే అభివృద్ధి


Sun,September 15, 2019 01:25 AM

రుద్రంగి: 30 రోజుల ప్రణాళికలో గ్రామస్తులంతా కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నా రు. చందుర్తి మండలంలోని మర్రిగడ్డ, జోగాపూర్, రామరావ్‌పల్లి, సనుగుల గ్రామాలను డీపీవో రవీందర్‌తో కలిసి ఆయన శనివారం సందర్శించారు. గ్రామాల్లో వాడవాడలా తిరుగుతూ 30 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించా రు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ పచ్చదనం, పా రిశుధ్యంతోనే గ్రామ ప్రజలు అరోగ్యంగా ఉంటారన్నారు. 30 రోజుల ప్రణాళికల్లో హరితహారం, పారిశుధ్యం, వీధిదీపాలు, పనుల కమిటీ సభ్యులు గ్రామస్తులు, అధికారులతో భాగస్వామ్యంతో సమస్యలు గుర్తించాలని, శ్రమదానంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. గ్రామాలు పచ్చగా ఉంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందన్నారు. ప్రతీ ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నా రు. ఇంకుడుగుంతలు నిర్మించుకోవడంతో దోమల బెదడ తగ్గి, భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. రోడ్లపై చెత్త వేసిన వారికి జరిమానాలు విధించాలన్నారు. గ్రామంలో డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాడుబడిన ఇండ్లను, బావులను పూడ్చివేయాలన్నారు. దాతలు, గ్రా మస్తుల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నా రు. గ్రామాల్లో పనులు జరుగకపోతే ఫిర్యాదుచేయాలని మొబై ల్, వాట్సప్ నంబర్లను వెల్లడించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...