పరిశుభ్రతతోనే ఆరోగ్యం


Sun,September 15, 2019 01:24 AM

ఎల్లారెడ్డిపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం గా జీవించవచ్చని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ సూచించారు. మండలంలోని వెంకటాపూర్‌లో ఆయన శనివారం పర్య టించారు. గ్రామంలోని పరిసరాలను, పారిశుధ్య పను ల పురోగతి పరిశీలించారు. వీధుల్లో తిరుగుతూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి సి బ్బందిపై అసహనం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడు తూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను కూడా పరిశుభ్రం గా ఉంచుకోవడం ప్రతిఒక్క రి బాధ్యత అన్నారు. ఇం టి పరిసరాలు సరిగాలేకపోతే పక్కింటివారికి కూడా నష్టంచేసినట్లేనని తెలిపారు. వెంకటాపూర్‌లో కొంతకాలంగా విషజ్వరాలు ప్రబలుతున్న విషయాన్ని తెలుసుకుని మెడికల్‌క్యాంపు ఏర్పాటు చేయించారు. ఇంటింటికీ వైద్యసిబ్బందితో తిరుగుతూ ఇండోర్ స్ప్రేయింగ్ చేయించారు. యాంటి లార్వాయిల్ స్ప్రేయింగ్ సైతం చేయించారు. 131 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. క్యాంపులో వైద్యాధికారి కపిల్‌సాయి, మానస, సర్పంచ్ అంజవ్వ, ఎంపీటీసీ తిరుపతి, సీఎచ్‌వో శ్రీనివాస్‌రెడ్డి, నర్సయ్య, ఎచ్‌ఈవో లింగం, సూపర్‌వైజర్ శోభారాణి, హెల్త్ అసిస్టెంట్ ర మేశ్, నరేందర్, ఏఎన్‌ఎం వినోద, పద్మజ, అనసూయ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...