ఆవర్తన పట్టికపై అవగాహన పెంపొందించుకోవాలి


Sat,September 14, 2019 03:59 AM

సిరిసిల్ల ఎడ్యుకేషన్: విద్యార్థులు ఆవర్తనా ప ట్టిక, మానవ సంక్షేమంపైన వాటి ప్రభావం వంటి అంశాల మీద పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని డీఈవో రాధాకిషన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల(శివనగర్)లో జిల్లా పీరియాడిక్ టేబుల్ జిల్లాస్థాయి పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 11 మండలాల నుంచి 22 మం ది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. మనం తీ సుకునే ఆహారం నుంచి మొదలు రోజువారి దినచర్యలో మూలకాల వినియోగం, ఉపయోగంపౌ విద్యార్థులకు వివరించారు. ఇలాంటి కార్యక్రమా ల వల్ల మూలకాలతో కలిగే ప్రయోజనాలపై వి ద్యార్థులు పట్టు సాధిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన హన్మజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని మాలవిక, ద్వితీయ స్థానం ఎల్లారెడ్డిపేట పాఠశాల విద్యార్థిని కీర్తనలను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకొనిరావాలని ఆకాంక్షించారు. సైన్స్ అధికారి ఆంజనేయులు, న్యాయనిర్ణేతలుగా లక్ష్మణ్, విష్ణుప్రసాద్, అకడమి క్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, సుధాకర్, మనోహర్, రాజు,వెంకటేశం,సరిత,తిరుపతి పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...