విద్యార్థినుల ప్రతిభ


Sat,September 14, 2019 03:58 AM

వేములవాడ రూరల్ : మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని మాళవిక జిల్లా స్థాయి సెమినార్‌లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు ఉమారాణి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపా ధ్యాయురాలు మాట్లాడుతూ జిల్లాస్థాయిలో పిరియాడిక్ టేబుల్ రసాయన మూలకాలు, మానవ జీవితంపై ప్రభావం అనే అంశంపై సెమినార్ నిర్వహించగా మాళవిక ప్ర థమ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే సెమినార్‌కు ఎంపికైందన్నారు. ఈ సం ద ర్భంగా మాళవిక ఎంపికపై ప్రధానోపాధ్యాయురాలితోపాటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

పెయింటింగ్ పోటీల్లో ..
వేములవాడ, నమస్తే తెలంగాణ: స్వచ్ఛత పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన పెయిటింగ్ పోటీల్లో వేములవాడ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థిని ఎన్నం మనోజ్ఞ శ్రీ ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఉమ బాలచందర్ తెలిపారు. జూనియర్ విభాగంలో సదరు విద్యార్థిని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సదరు విద్యార్థినికి ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...