రైతులకు ఫసల్‌బీమా వరం


Sat,September 14, 2019 03:58 AM

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతుల పాలిట వరమని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా కేం ద్రంలోని పొదుపు భవనంలో ఖరీఫ్ సీజన్‌పై ప్ర ధానమంత్రి ఫసల్ బీమా యోజన-2019 పై వ్యవసాయాధికారులకు, తాసిల్దార్లకు జిల్లా స్థా యి శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ వరి పైరు వేసిన రైతులు నష్టపరిహారం పొందే పరిస్థితులు విధి విధానాలు, క్షేత్రస్థాయి సిబ్బంది పంట కోత ప్రయోగాలు నిర్వహించే సమయం లో రైతుల నుంచి సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు. వరిపైరుపై పంట కోత ప్రయో గాలు నిర్వహించడానికి తగిన పద్ధతులు, సమర్పించాల్సిన ఫారాలు, సంబంధిత రైతుల వివరాలను సేకరించే విధానంలో పూర్తిస్థాయిలో శిక్షణ తరగతులు తోడ్పడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సత్యప్రసాద్, ము ఖ్య ప్రణాళిక అధికారి ఆర్.రాజారాం, సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఎన్‌ఎస్‌వో) జి.శ్రీనివాసరావు, ఉపగణాంక అధికారి ఎన్.రామకృష్ణ, బీమా కంపెనీ ప్రతినిధు లు, వివిధ మండలాల తాసిల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారు లు, మండల ప్రణాళిక, గణాంక అధికారులు, వ్య వసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...