బాధిత కుటుంబానికి పరామర్ష


Sat,September 14, 2019 03:58 AM

కొత్తపల్లి గ్రామానికి చెందిన కాల్వ సుధాకర్ ఇటీవల గ్రామ సమీపాన జరిగిన బైక్-లారీ ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని కొండూరి రవీందర్‌రావు పరామర్షించారు. ఆర్థిక పరిస్థిలను తెలుసుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఇల్లు కూలిన బాధితునికి సాయంముచ్చర్ల గ్రామానికి చెందిన వీరబత్తిని అంజ య్య ఇల్లు గత నెలలో కురిసిన వర్షాలకు పూర్తిగా కూలి పోయింది. బాధిత కుటుంబానికి ప్ర భుత్వం ద్వారా మంజూరైన రూ.93 వేల చెక్కును రవీందర్‌రావు అందజేశారు. పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని అధైర్యపడవద్దని రవీందర్‌రావు సూచించారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, తాసిల్దార్ సుమచౌదరి, ఏఎంసీ చైర్మన్ లింగన్నగారి దయాకర్‌రావు, జడ్పీకోఆప్షన్ సభ్యుడు అహ్మద్, టీఆర్‌ఎస్ మండలాద్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ రాజేందర్, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు దోసల లత, సర్పంచులు అక్కపల్లి స్వరూప, తేజావత్ రజిత, ఉపసర్పంచులు ప్రసాద్, వంగ రాఘవేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు వంగ స్వప్ణ, సింగిల్ విండో డైరెక్టర్ అక్కపల్లి రాజనర్సింహారెడ్డి, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్‌రెడ్డి, కమ్మరి రాజారం, చేరాల వెంకటస్వామిగౌడ్, దేవయ్య, మహబూబ్‌అలీ, తేజావత్ అనిల్, వంగ రవీందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సంజీవ్, రాజనర్సు, నర్సింలు, రెవె న్యూ అధికారులు, గ్రామస్తులు ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...