చీరె, చెక్కు అందించడం అభినందనీయం


Sat,September 14, 2019 03:57 AM

గంభీరావుపేట: పేదింటి కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిలకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణ లక్ష్మి పథకం డబ్బులతోపాటు మండల ప్రజాప్రతినిధులు చీరె, కనుము అందించడం అభి నందనీయమని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. పేద ఆడ పిల్లల పెళ్లి ఖర్చులకు స్వంత మేనమామ వలె ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రూ.లక్ష నూట పదహారు రూపాయ ల చెక్కులు అందించడం బంగారు తెలంగాణకు నిదర్శనమని అన్నారు. మండలంలోని కొత్తపల్లి, ముచ్చర్ల గ్రామాల్లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు కొండూరి రవీందర్‌రావు పంచాయతీ కార్యాలయ ఆవరణలో చెక్కుల పంపిణీ చేశారు. కల్యాణల క్ష్మి పథకం ద్వారా డబ్బులు అందించడం దేశానికి ఆదర్శమన్నారు. పేదల సంక్షేమం లక్ష్యంగా ము ఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభు త్వం పని చేస్తుందని తెలిపారు. ఎంపీపీ, జడ్పీటీసీ సమకూర్చిన చీరె, కనుము అందజేయడం అభి నందనీయమన్నారు. రాష్ట్ర ఐటీమంత్రి కేటీఆర్ స హకారంతో అభివృద్ధి పనులకు నిధులు మం జూరు చేసుకుంటూ ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని పేర్కొన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ల క్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రతిపక్షాలు విమర్షించడం సరికాదన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...