గ్రామాల అభివృద్ధికి సమష్టిగా..


Fri,September 13, 2019 04:42 AM

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లెల్లో ప్రగతి చైతన్యం వెల్లివిరుస్తున్నది. సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో ఉద్యమంలా కొనసాగుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో చేపడుతున్న కార్యక్రమాలలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామాలను శుభ్రం చేసుకుంటున్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో 1300 ఇండ్లుండగా, గురువారం దాదాపు ఇంటికొకరు చొప్పున వెయ్యి మంది ముందుకు వచ్చి తమ గ్రామాన్ని శుభ్రం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పారిశుధ్యం, మురుగు కాలువల్లో పూడిక తీయడం, పాడుబడ్డ బావిని పూడ్చివేశారు. గ్రామాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్, పంచాయతీ అధికారి రవీందర్ సందర్శించి గ్రామస్తులను అభినందించారు. మోహిని కుంట గామంలో ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు నిర్వహించారు.

గూడెం, మోహినికుంట, కోనరావుపేట మండలం మర్థనపేట, తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామాలను కలెక్టర్ సందర్శించి, ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో పారిశుధ్య కార్యక్రమాలను జేసీ యాస్మిన్ భాషా పర్యవేక్షించారు. అదే మండలంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక ఆధ్వర్యంలో గొల్లపల్లిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. వెంకటాపూర్‌లో శిథిలంలో ఉన్న ఇంటిని కూల్చివేశారు. వేములవాడ మండలం అనుపురంలో జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీడీవో రాంరెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. నూకలమర్రి, చెక్కపల్లిలో గ్రామ సభలు నిర్వహించారు. చందుర్తి, రుద్రంగి మండలాలో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి వీధులను శుభ్రం చేశారు. రోడ్లపై చెత్తవేస్తే రూ.500 జరిమానా విధించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్‌వో ఖిమ్యానాయక్, డీపీఆర్వో దశరథం, ఏవో గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ముస్తాబాద్ : పరిశుభ్రం, పచ్చదనంతో ప్రజ లు ఆరోగ్యంగా ఉంటారని, ప్రజల భాగస్వా మ్యం, శ్రమదాన కార్యక్రమాలతోనే సాధ్యమని కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. మోహినికుంట, గూడెం గ్రామాల్లో గురువారం పారిశుధ్య పనులను కలెక్టర్, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 9.30 గంటలకు మోహినికుంటకు చేరుకొని గ్రామంలో ఈజీఎస్ ద్వారా పూర్తయిన పనులు శ్మశాన వాటిక, దోబీఘాట్, సీసీ రోడ్లు, జీపీ భవనం, గొర్రెల షెడ్స్, మూడు కమ్యూనిటీ సోఫ్‌పీట్స్, ప్లాంటేషన్స్, వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు పూర్తి చేసిన గ్రామాన్ని హరితహారంలో ముందు నిలుపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోహినకుంటలో ఉపాధిహామీ పనులు బాగున్నాయని కితాబిచ్చారు. గ్రామంలో తుది దశలో ఉన్న రెండు పడకల గృహాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెలు అభివృద్ధిలో ముందుంటాయన్నారు. ప్రణాళికలో భాగంగా గ్రామంలో కమిటీల పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గూడెంలో పారిశుధ్య పనుల పరిశీలన
30 రోజల కార్యచరణ ప్రణాళికలో భాగంగా గూడెంలో మురుగు కాల్వల్లో చెత్తాచెదారం తీసివేత, పరిశుభ్రత కార్యక్రమంలో 600 మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రధాన రహదారితో పాటు ఇందిరమ్మకాలనీ, నర్సింహస్వామి దేవాలయం, పాఠశాలలో చెత్తచెదారంతో పాటు గడ్డి, చెట్లు, ముళ్లపొదలు తొలగించారు. దారులను పునరుద్ధరించారు. పనులను కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో పాటు అధికారులు పరిశీలించారు. దారిలో ఇంటి ముందు చెత్తను కాల్చిన ఇం టి యజమానికి రూ.2000 వేలు ఫైన్ వేయగా, స్థానికులు సర్దిచెప్పగా కలెక్టర్ రూ.500 జరిమానా వేశారు. రహదారులపై చెత్త వేస్తే ఫైన్ తప్పదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు, ఏఎంసీ చైర్మన్ ఉల్లి యాది మల్లేశ్‌యాదవ్, సర్పంచులు కల్వకుంట్ల వనజ, చిట్నేన్ని సరిత, ఉప సర్పంచులు సంధ్య, చాడ శ్రీనివాస్, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, మాజీ జడ్పీటీసీ మేర్గు యాదగిరిగౌడ్, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు సురేందర్‌రావు, నాయకులు కొమ్ము బాలయ్య, అంజన్‌రావు, ఆయా గ్రామాల మహిళ, కుల సంఘల సభ్యులు, రైతు నాయకులు, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, డీఆర్‌డీవో రవీందర్, ఏపీడీ కృష్ణ, ఎంపీడీఓ వెంకట్రాంరెడ్డి, తాసిల్దార్ యాకన్న, ఏపీఎం మల్లయ్య పాల్గొన్నారు.

పరిశుభ్రత, పచ్చదనంతో విరజిల్లాలి
సిరిసిల్ల రూరల్ : గ్రామాలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో విరజిల్లాలని, ఇందుకు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేస్తున్నామని కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో గురువారం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను సర్పంచ్ బైరి శ్రీవాణి, పాలకవర్గంతో కలిసి పరిశీలించారు. పారిశుధ్యం, హరితహారం, విద్యుత్‌తో పాటు ఇతర కమిటీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అంకితభావం, ప్రజాభాగస్వామ్యంతో పనిచేసి, నిర్దేశిత బాధ్యతలు సక్రమంగా పూర్తి చేయాలన్నారు. పనులను 15 రోజుల లక్ష్యంతో పూర్తి చేయాలన్నారు. గ్రామంలో పచ్చదనం కోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. రోడ్లు, మురుగుకాలువలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.రోడ్లపై చెత్త వేసినవారికి జరిమానా విధించాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. శిథిలావస్థలోని ఇండ్లను ప్రజల సహకారంతో తొలగించాలని, పాడుబడిన బావులను పూడ్చి వేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలను తొలగించి, నిరుపయోగంగా ఉన్నబోర్లు, లోతట్టు ప్రాంతాల్లోని గుంతలను పూడ్చివేయాలన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు లేకుండా పనులు నిర్వహించాలన్నారు. 30 రోజుల ప్రణాళికలో రోజువారి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. వివరాలను ప్రతి రోజూ సాయంత్రం సంబంధిత మండలాల ప్రత్యేక అధికారులను నివేదించాలన్నారు. 30 రోజుల కార్యక్రమం సరిగా అమలు కాకుంటే మొబైల్ నంబర్ 6309141122కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అపరిశుభ్రత పరిసరాల ఫొటోలను వాట్సాప్ నంబర్ 9963340934కు పంపించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ బైరి శ్రీవాణి, బైరి రమేశ్, ప్రత్యేక అధికారి ఆర్‌ఐ సంతోష్‌తో పాటు పంచాయతీ పాలవర్గ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

సమష్టిగా కృషిచేయాలి
కోనరావుపేట : గ్రామాలు పారిశుధ్యం, పచ్చదనంతో విలసిల్లేలా 30 రోజుల ప్రణాళికను పక్కగా అమలు చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కోనరావుపేట మండలంలోని మర్తనపేట, కొలనూర్ గ్రామాల్లో తనిఖీ చేశారు. ముందుగా మర్తనపేట గ్రామపంచాయతీ ఆవరణంలో స్టాండింగ్ కమిటీలతో పలు అంశాలపై చర్చించారు. ప్రణాళికల్లో భాగంగా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పురవీధులగుండా తీరుగుతూ పారిశుధ్యంపై ఆరా తీశారు. ఇంటి ముందు చెత్తవేసినా, మురుగుకాలువలు శుభ్రత పాటించకపోయినా జరిమానాలు విధించాలని అధికారులకు ఆదేశించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు. ఇప్పటికే గ్రామంలో 172 ఇంకుడు గుంత నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పైపుల లీకేజీ పనుల త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్మశానవాటికను నిర్మించేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ దృషికి సర్పంచ్ తీసుకెళ్లగా, వెంటనే ఆయన తాసిల్దార్ రమేశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం కోలనూర్‌లో పనులను పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి వాటి స్థానంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు వంశీకృష్ణరావు, తుమ్మల యమున, ఎంపీటీసీ ప్రవీణ్‌కుమార్, ఉపసర్పంచులు తిరుపతి రెడ్డి, శంకర్, ప్రత్యేక అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...