నేడు జిల్లాకు కేటీఆర్


Mon,March 25, 2019 02:01 AM

- 15వేల మందితో సిరిసిల్లలో భారీ బహిరంగ సభ
- హాజరు కానున్న మంత్రి ఈటల, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల నియోజకవర్గంలో నేడు పర్యటించనున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం 6గంటలకు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. సభకు కేటీఆర్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనర్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్‌కుమార్ హాజరు కానున్నారు. సభకు 15వేల మందిని తరలిం చేందుకు గులాబీశ్రేణులు సమాయత్తమవుతున్నా రు. సభ ఏర్పాట్లను టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రాష్ట్ర నేతలు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణిలతో కలిసి ఎంపీ వినోద్‌కుమార్ ఆదివారం పరిశీలించారు.

వరుసగా బహిరంగ సభలు..
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎన్నికల ప్ర చారం నిర్వహించనున్నారు. అందులో భాగంగా తొలుత సోమవారం సా యంత్రం 6 గంటలకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం 27 న ఉదయం 10గంటలకు ముస్తాబా ద్ మండల కేంద్రంలో ఉదయం 10 గంటలకు, 29న సాయంత్రం 4గంటలకు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలంలో, 31న ఉదయం 10గంటలకు గంభీరావుపేట మండలం, ఏప్రిల్ 2న తంగళ్లపల్లి మండలంలో నిర్వహించే బహిరంగ సభల్లో కేటీఆర్ పా ల్గొంటారు. ఆయా సభలకు భారీగా జనసమీకరణకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...