సభకు భారీగా తరలిరావాలి..


Mon,March 25, 2019 01:58 AM

- కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్
- సిరిసిల్ల కళాశాల మైదానంలో ఏర్పాట్ల పరిశీలిన

సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో నేడు నిర్వహించ తలపెట్టిన సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు చీటి నర్సింగరావు, గూడూ రి ప్రవీణ్‌లతో కలిసితో ఆయన ఆదివారం పరిశీలించా రు. విద్యుత్ లైట్లు, షామియానాలు ఏర్పాట్లపై పార్టీ నా యకులకు దిశానిర్దేశం చేశారు.

గులాబీని గెలిపిద్దాం.. ఢిల్లీని శాసిద్దాం..
అనంతరం ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ తె లంగాణ 16 పార్లమెంట్ స్థానాల్లో గులాబీని గెలిపించి ఢిల్లీని శాసిద్దామని పిలుపునిచ్చారు. దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అనివార్యమని జాతీయ సర్వేలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయని వెల్లడించారు. గత ఎన్నికల్లో ప్రజలపై మోడీ ప్రభావం ఉండిందని, తద్వారా బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిందని, ఐదేండ్ల పాలనలో మోడీ మేనియా రోజురోజుకీ తగ్గిపోయిందని వి వరించారు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని, వంద స్థానాలు సైతం వచ్చే పరిస్థితులు లేకుండా పోయిందని తెలిపారు. మోడీ విభజన హామీలను అమలుచేయకుండా తెలంగాణకు తీవ్ర అన్యా యం చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జా తీయ హోదా కల్పించిన మోడీ ప్రభుత్వం తెలంగాణలోని ప్రాజెక్టులకు హోదా కల్పించడంలో నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. నిర్ణయాత్మక శక్తి మనలో ఉండి ఉంటే కాళేశ్వరానికి జాతీయ హోదా వచ్చి ఉండేదని వివరించారు. తెలంగాణ ఆలోచన దేశ ఆచరణగా మారతున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలన్నా.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరాలన్నా రాబోయే ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉందన్నారు. మరోసారి ఎంపీగా ఆశీర్వదించి భారీ మెజార్టీని అందించాలని కోరారు. నేటి సభకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంట్ ఎన్నికల కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఈటల రాజేందర్ రానున్నారని, ప్రజలు తరలిరావాలని కోరారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు చీటి నర్సింగారావు, గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు చక్రపాణి, బొల్లి రాంమోహన్, సామల దేవదాస్, జక్కుల నాగరాజు తదితరులున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...