భారీ మెజార్టీయే లక్ష్యం


Mon,March 25, 2019 01:58 AM

- కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి:ఎమ్మెల్సీ భానుప్రసాద్
ముస్తాబాద్: రాబోయే ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, భారీ మెజార్టీని సాధించడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులు కృషి చేయాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్ పిలుపునిచ్చారు. పక్కా ప్రణాళికతో ప్రచారం చేయాలని సూచించారు. మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొమ్ము బాలయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యకర్తల స మావేశానికి ఎమ్మెల్సీ ముఖ్యఅథితిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పేర్లను మార్చి ఇతర రాష్ర్టాలు అమ లు చేస్తున్నాయని, దేశ ప్రజలు కేసీఆర్ లాంటి ముందు చూపుతో పని చేసే నాయకుడే కావాలని కోరుకుంటున్నారని వివరించారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మోజార్టీతో గెలిపించి దన్నుగా నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయడమేగాక, నిధుల కోసం కొట్లాడి అన్నిరంగాల్లో జిల్లాను ముందుంచిన నాయకుడు బోయినిపెల్లి వినోద్‌కుమారని కొనియాడారు. ఆయనకు భారీ మెజార్టీ అందించి మరోసారి కరీంనగర్ సత్తా చాటాలన్నారు. 27న నిర్వ హించ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

బహిరంగ సభకు స్థల పరిశీలన..
అనంతరం ముస్తాబాద్‌లో చేపట్టిన సభ ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి ఎమ్మెల్సీ భానుప్రసాద్ పరిశీలించారు. సభకు మండలం నుంచి పదివేల మందిని సమీకరించాలని, అందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడురి ప్రవీణ్, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగారావు, ఎం పీపీ అక్కరాజు శ్రీనివాస్, జడ్పీటీసీ జనగామ శరత్‌రావు, సెస్ డైరెక్టర్ ఏను గు విజయరామారావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్‌పాషా, సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ యాది మల్లేశ్ యాదవ్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్‌రావు, డాక్టర్ చంద్రశేఖర్‌రావు, శ్రీనివాస్‌రావు, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామశాఖల అధ్యక్షులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...