నేడు ఆఖరు


Mon,March 25, 2019 01:58 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ సోమవారంతో ముగియనున్నది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీ వినోద్‌కుమార్ ఈ నెల 18న మొదటి రోజునే మం త్రులు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి నిరాడంబరంగా నామినేషన్ వేశారు. 20న ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తన ప్రధాన అనుచరులతో వచ్చి దాఖలు చేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి చింతల అనిల్‌కుమార్, జై స్వరాజ్ పార్టీ నుంచి పల్లె ప్రశాంత్, ఆంటి కరెప్షన్ డైనమిక్ పా ర్టీ నుంచి అయిల ప్రసన్నతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా చిలువేరు శ్రీకాంత్, పబ్బ భాను లక్ష్మణ్, గంగారపు తిరుపతి, శనిగరం రమేశ్‌బాబు ఇప్పటి వరకు నామినేషన్లు వేశారు. మొత్తంగా చూస్తే ఈ నెల 22 వరకు 9 మంది అభ్యర్థులు 14 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు.

నేడు పెద్ద సంఖ్యలో దాఖలు..
పార్లమెంట్ ఎన్నికలకు సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. దీంతో ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వరకే నిరాడంబరంగా నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు సోమవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అభ్యర్థిత్వం ఆలస్యంగా ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన సోమవారమే నామినేషన్ వేయనున్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు, చిన్నా చితక పార్టీల అభ్యర్థులు కూడా ఈ రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉంది. పలు కారణాలతో నామినేషన్లు వేసేందుకు కొందరు పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలు తీసుకెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో పరిమితంగా దాఖలైన నామినేషన్లు ఇపు డు పెద్ద సంఖ్యలో దాఖలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగినట్లు చివరి రోజున నామినేషన్లు గడువులోగా స్వీకరించేందుకు ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో అధికారులు జయప్రదంగా నామినేషన్ల పర్వం ము గించేందుకు సిద్ధమయ్యారు. కాగా, మంగళవారం నామినేషన్ల పరిశీల పూర్తి చేస్తారు. 28న ఉపసంహరణ ఉంటుంది. అయితే ఎంత మంది నామినేషన్లు వేస్తారు, ఎందరు ఉప సంహరించుకుంటారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...